మహేష్ టీజర్ రెడీ అయిపోయిందట

Update: 2017-02-16 06:17 GMT
మహేష్ బాబు కొత్త సినిమా అప్ డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మురుగదాస్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ బైలింగ్యువల్ మూవీ.. షూటింగ్ పూర్తయిపోతోంది కానీ.. ఇప్పటివరకూ టైటిల్ కానీ ఫస్ట్ లుక్ కానీ ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగించే  విషయమే. అయితే.. ఫ్యాన్స్ లో నెలకొన్న ఈ ఆతృతను ముందే ఊహించిన మహేష్ అండ్ టీం ఇప్పుడు టీజర్ ను రెడీ చేసేస్తున్నారట.

35 సెకండ్ల నిడివి ఉండే ఈ టీజర్ ను ప్రత్యేకంగా యూకేలో సిద్దం చేయిస్తున్నాడు మురుగదాస్. గ్రాఫిక్స్ వర్క్ కు ఉన్న ఇంపార్టెన్స్ ను దృష్టిలో ఉంచుకుని.. స్పెషల్ గా చేయించిన ఈ టీజర్ సూపర్బ్ గా వచ్చిందని యూనిట్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఫస్ట్ లుక్ తో పాటే టైటిల్ ను కూడా విడుదల చేయాలని భావిస్తున్నారట. ఇప్పటికే సంభవామి అనే టైటిల్ పరిశీలనలో ఉన్న సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్.. టీజర్ రిలీజ్ ల డేట్ ఇంకా నిర్ణయించలేదు కానీ.. త్వరలోనే దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ రానున్నట్లు తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News