మంచు మోహన్ బాబు మామగా.. అల్లరి నరేష్ అల్లుడిగా నటించిన "మామ మంచు అల్లుడు కంచు" చిత్రం విడుదలకి సిద్ధమైపోయింది. క్రిస్మస్ రోజున రిలీజ్ షెడ్యూల్ చేసిన మామ మంచు.. అల్లుడు కంచు చిత్రానికి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. మూవీకి యూ/ఏ సర్టిఫికేట్ ఇస్తూ సెన్సార్ బోర్డ్ క్లియరెన్స్ ఇచ్చేసింది. ఒక్క కట్ కూడా చెప్పకుండా.. సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ జారీ చేయడం విశేషం.
సెన్సార్ టాక్ ప్రకారం "మామ మంచు అల్లుడు కంచు" పూర్తి స్థాయి వినోదాత్మకంగా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రమ్యకృష్ణ, మీనాలతో.. మోహన్ బాబు చేసిన సందడి సూపర్బ్ గా ఉందన ిటాక్. మరోవైపు హీరోయిన్ పూర్ణతో.. నరేష్ అల్లరి కూడా బాగా వచ్చిందట. మామా అల్లుళ్ల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్ అంటున్నారు. గతంలో సెన్సార్ బోర్డ్ లో ఆఫీసర్ గా ధనలక్ష్మి ఉన్నపుడు మోహన్ బాబు సినిమాలకు వరుసగా అడ్డంకులు ఎదురయ్యేవి. ఏ మాత్రం ఆలోచించకుండా.. విపరీతంగా కట్స్ చెప్పడం, బీప్ సౌండ్ లు వేయాలనడం, విడుదలకు అడ్డు పడడం లాంటి చర్యలపై.. మోహన్ బాబు డైరెక్టుగానే విమర్శలకు దిగారు. ఇప్పుడామె వెళ్లిపోవడంతో.. మోహన్ బాబు మూవీ ప్రశాంతంగా ఏ అడ్డంకి లేకుండా రిలీజ్ కి రెడీ అయింది.
క్రిస్మస్ పండుగ రోజున వస్తున్నా.. ఇప్పుడీ మామ మంచు అల్లుడు కంచు.. చాలా సినిమాలతోనే పోటీ పడాల్సి ఉంటుంది. అయితే... మామా అల్లుళ్ల ఫైట్ ఎప్పుడూ మన టాలీవుడ్ లో క్రేజీ సబ్జెక్టే కాబట్టి.. పాజిటివ్ టాక్ వస్తే హిట్ కొట్టేసినట్లే అని చెప్పాలి.