ఒక సినిమా వచ్చిన తరువాత.. ఒకప్పుడు దానిని వారం పాటు ధియేటర్లలో ఉంచేవారు. రెండో వారం నుండి పికప్ అయ్యి సూపర్ హిట్ అయిన సినిమాలు అనేకం. సాక్షాత్తూ కె.విశ్వనాధ్ వారి సినిమాలే 3వ వారం నుండి హౌజ్ ఫుల్స్ వేయించుకున్న రోజులున్నాయి. కాని ఇప్పుడు ఒక సినిమాకు అంత లైఫ్ టైమ్ లేదు. అందుకే 3 రోజులకంటే ఎక్కువ ఎవ్వరూ వెయిట్ చేయట్లేదు. అదే ఇప్పుడు కొన్ని సినిమాలకు ఇబ్బందికరంగా కూడా మారుతుంది.
మొన్న రిలీజైనప్పుడు పెళ్ళి చూపులు సినిమా కొన్ని పెద్ద మల్టీప్లెక్సుల్లో కేవలం 3 స్ర్కీన్లలో విడుదలైంది అంతే. కాని ఎప్పుడైతే 'ఎ' సెంటర్లలో జక్కన్న సినిమా సరిగ్గా ఆడట్లేదో.. వెంటనే ఆ సినిమాను పెళ్ళి చూపులతో రీప్లేస్ చేసి.. ఇప్పుడు 9 స్ర్కీన్లలో ఈ సినిమాను వేస్తున్నారు. ఇక రేపు మనమంతా - శ్రీరస్తు శుభమస్తు సినిమాలు వస్తున్నాయి. వీటికి ప్లేస్మెంట్ బాగానే దొరికింది. కాకపోతే పొరపాటున కంటెంట్ క్లిక్ కాకపోయినా.. మొదటి 3 రోజుల్లో రెవెన్యూలు సరిగ్గా లేకపోయినా కూడా.. వెంటనే కొన్ని స్ర్కీన్లను తగ్గించి.. పక్కనే ఉన్న పెళ్ళి చూపులకు ఇచ్చేస్తారట. మిగిలినవి.. కొన్ని హాలీవుడ్ సినిమాలకు ఎలాట్ చేస్తారట. కాబట్టి ఏ సినిమా అయినా కూడా మూడు రోజుల్లో సత్తా చాటల్సిందే.
ఇకపోతే పెద్ద సినిమాలకు.. పెద్ద స్టార్ల సినిమాలకూ ఉన్న వెసులుబాటు ఏంటంటే.. ఆక్యుపెన్సీ రేటు సరిగ్గా లేకపోయినా కూడా వాటిని ఓ రెండు వారాలు రన్ చేస్తారు. ఎందుకంటే పెద్ద స్టార్లకు ఆ మాత్రం ధియేటర్లు ఎలాట్ చేయకపోతే తరువాత జనాలు రావడం మానేసే ఛాన్సుందిలే.