మంచు మనోజ్ హీరోగా రామ్ గోపాల్ వర్మ తీసిన మూవీ ఎటాక్.. ఏప్రిల్ 1న విడుదలైంది. తొలి రోజు తొలిఆటకే ఎటాక్ పరిస్థితి ఏంటో తేలిపోయింది. తమపై వర్మ చేసిన ఈ ఎటాక్ ను ప్రేక్షకులు ఏ మాత్రం తట్టుకోలేకపోయారు. ఈ మూవీకి రివ్యూలు - రేటింగులు కూడా దారుణంగానే వచ్చాయి. సాధారణంగా ఇలా నెగిటివ్ రివ్యూలు వచ్చినపుడు.. చాలా మంది రివర్స్ ఎటాక్ చేస్తుంటారు. తామో గొప్ప సినిమా తీస్తే, రివ్యూలు రాసి చెడగొట్టేశారని తెగ ఫీలయిపోతూ ఉంటారు.
కానీ మంచు మనోజ్ ఈ అంశంపై స్పందించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. 'నా పాత్రను అభినందిస్తున్నందుకు థ్యాంక్స్. రిజల్ట్ ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు, మన చేయగల ప్రయత్నం మాత్రమే మన కంట్రోల్ లో ఉంటుంది. లవ్ యూ ఆల్.. రివ్యూలు రాసిన వారితో నేను అంగీకరిస్తున్నా' అని ట్వీట్ చేశాడు మంచు మనోజ్. అంటే ఈ మూవీ అట్టర్ ఫ్లాప్ అని తనే ఒప్పుకున్నాడు. నిజానికి ఇలాంటి రిజల్ట్ ని మనోజ్ ముందుగానే ఊహించాడు. అందుకే ఎప్పుడో కంప్లీట్ అయినా.. ల్యాబ్ లోనే ఉంచేశాడు.
శౌర్య సినిమా హిట్ అయి, దాని ద్వారా ఏదన్నా పాజిటివ్ టాక్ వస్తే, ఎటాక్ కు హెల్ప్ అవుతుందని గతంలో చెప్పాడు మనోజ్. అంటే మనోజ్ కి ఎటాక్ పై నమ్మకం లేదనే విషయం అప్పుడే అర్ధమైనా.. ఇప్పుడు ఫ్లాప్ ని ఓపెన్ గానే ఒప్పుకున్నాడు. మరోవైపు మనోజ్ సోదరి మంచు లక్ష్మి'నీ నిజాయితీ నన్ను గర్వపడేలా చేసింది' అని ట్వీట్ చేసింది. 'నీ అంత ఓపెన్ గా ఎవరూ చెప్పలేరు' అంటూ మంచు విష్ణు ట్వీట్ చేయడం విశేషం.