టాలీవుడ్ లోని ప్రముఖ సినీ కుటుంబాలలో మెగా... మంచు ఫ్యామిలీలు ఉంటాయి. అయితే మెగా- మంచు కుటుంబాల మధ్య అనుబంధం వివరించడానికి మాటలు సరిపోవు. దూరంగా ఉన్నట్టు కనిపిస్తారు కానీ దగ్గరగా ఉంటారు. దగ్గరగా ఉన్నట్టే అనుకునేలోపు ఏదో విభేదాలు అంటూ ప్రచారం సాగుతోంది. ఏదైతేనేం ఈమధ్య మాత్రం మెగా-మంచు కుటుంబాల మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉందని మాత్రం సూచనలు అందుతున్నాయి. మా మీటింగ్ లో చిరంజీవి.. మోహన్ బాబు ఆత్మీయం గా ఆలింగనం చేసుకోవడం... సోదర భావంతో ముద్దు పెట్టుకోవడం కూడా అందరికీ తెలుసు.
రీసెంట్ గా మంచు లక్ష్మి కూడా తమ కుటుంబాల మధ్య చిన్నప్పుడు ఎంత సాన్నిహిత్యం ఉండేదో... పిల్లలందరం ఎలా కలిసి సరదాగా గడిపేవారమో అన్నీ వెల్లడించింది. అప్పట్లో చిరంజీవి - మోహన్ బాబు కలిసి నటించినప్పుడు ఇరు కుటుంబాలు కూడా అవుట్ డోర్ షూటింగులకు కలిసి వెళ్ళేవారిమని అక్కడ తాము ఫుల్లుగా ఎంజాయ్ చేసేవారిమని కూడా మంచులక్ష్మి వెల్లడించింది. ఇదిలా ఉంటే తాజాగా మంచు మనోజ్ కూడా రామ్ చరణ్ తనకు మంచి స్నేహితుడు అంటూ ఒక పోస్ట్ పెట్టారు.
మంచు మనోజ్ 'అహం బ్రహ్మాస్మి' అనే సినిమాలో నటించబోతున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పటికే అందరినీ ఆకర్షించింది. ఈ సినిమాను మార్చ్ 6 న.. అంటే ఈరోజే లాంచ్ చేస్తున్నారు. పూజా కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చరణ్ హాజరవుతున్నారని... క్లాప్ కొట్టబోతున్నారని వెల్లడిస్తూ చరణ్ తో తనకున్న అనుబంధం గురించి ప్రస్తావించారు మనోజ్. తన పోస్ట్ లో చరణ్ ను సోదరుడు అంటూ సంబోధించడం విశేషం. ఈ పోస్ట్ కు సోషల్ మీడియాలో భారీ స్పందన దక్కింది. చాలామంది ఈ హీరోల మధ్య అనుబంధం బాగుందని మెచ్చుకున్నారు. అయితే కొందరు మాత్రం మంచు మనోజ్ మెగా ఫ్యాన్స్ ను ఎట్రాక్ట్ చేసేందుకు ఇలా చేస్తున్నాడని అభిప్రాయపడ్డారు.