బస్తా లాగా ఉన్నావన్నారు-మంచు మనోజ్

Update: 2017-01-31 11:15 GMT
హీరో అన్నాక ఫిజిక్ జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. బరువు అదుపు తప్పకూడదు. సాధ్యమైనంత వరకు స్లిమ్ముగా ఉండాలి. కండలు తిరిగి కనిపించాలి. ఐతే మంచు మనోజ్ మొదట్నుంచి కొంచెం బొద్దుగానే ఉంటున్నాడు. మధ్యలో ‘నేను మీకు తెలుసా?’ లాంటి సినిమాల్లో ఫిట్‌ గా తయారై కనిపించాడు కానీ.. ఆ తర్వాత చాలా సినిమాల్లో కొంచెం బొద్దుగానే ఉంటున్నాడు. ఈ మధ్య అయితే మరీ లావైపోయి.. కొంచెం ఎబ్బెట్టుగానే కనిపిస్తున్నాడు. ఈ విషయంలో అతడిపై సెటైర్లు చాలానే పడుతున్నాయి. ఆ సెటైర్లు తన చెవిన కూడా పడ్డాయని అంటున్నాడు మనోజ్. బస్తాలా ఉన్నావంటూ తనతోనే చాలామంది అన్నారని మనోజ్ చెప్పడం విశేషం.

ఐతే తన బాడీ మీద కేర్ లేకపోవడం వల్ల తానిలా తయారవ్వలేదని.. ఉద్దేశపూర్వకంగానే అలా మారానని మనోజ్ చెప్పాడు. ఇదంతా తన కొత్త సినిమా ‘ఒక్కడు మిగిలాడు’ కోసమేనని మనోజ్ వెల్లడించాడు. ఈ సినిమాలో తన పాత్ర డిమాండ్ చేయడంతోనే బరువు పెరగాల్సి వచ్చిందన్నాడు మనోజ్. ఆ పాత్ర అంతగా ఏం డిమాండ్ చేసిందో.. తానెందుకు అలా తయారయ్యానో మూడు నెలల తర్వాత ఆ సినిమా రిలీజైనపుడు సమాధానం తెలుస్తుందని మనోజ్ అన్నాడు. ఇది ఎల్టీటీఈ నేపథ్యంలో సాగే ఇంటెన్స్ స్టోరీ అని మనోజ్ తెలిపాడు. తన కెరీర్లో ఇదో ప్రత్యేకమైన సినిమా అన్నాడు. ఆల్రెడీ తమిళంలో రెండు సినిమాలు చేసిన అజయ్ నూతక్కి ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమవుతున్నాడు. దీని కంటే ముందు మనోజ్ నటించిన ‘గుంటూరోడు’ ప్రేక్షకుల ముందుకొస్తుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News