మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వివాదం ఇంకా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎంపిక కావడం..ప్రమా ణ స్వీకారం చేయడం అన్ని జరిగిపోయాయి. కానీ ఇంకా మాలో మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలిసిన సబ్యులు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో సన్నివేశం మరోసారి హీటెక్కిన సంగతి విధితమే. పదవులకు రాజీనామా చేసినా `మా` వెనుక ఉంటాం.. విష్ణుకు మద్దతిస్తామని..చక్కగా పరిపాలించగలడని...ఎన్నికలు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మాత్రం కచ్చితంగా ప్రశ్నిస్తామని బాహాటంగానే వెల్లడించారు. ఇప్పుడు ఈ అంశమే కాకలు రేపుతోంది.
ఈ నేపథ్యంలో విష్ణు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. రాజీనామాలు ఇంకా తనకు అందలేదని..లిఖిత పూర్వకంగా ఎలాంటి పత్రాలు తన వరకూ రాలేదని విష్ణు తెలిపారు. లిఖిత పూర్వకంగా తన దృష్టికి రాజీనామా పత్రాలు అందిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానన్నారు. అలాగే విష్ణు తనదైన శైలిలో సెటైరికల్ గాను స్పందించారు. వచ్చే ఎన్నికల్లో కూడా ప్రకాష్ రాజ్ పోటీ చేయవచ్చు. తెలుగు మాట్లాడలేని సభ్యులు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులని మేము ఎక్కడా చెప్పలేదు. అదంతా వాళ్లకు వాళ్లుగా ఊహించుకుని ఉండొచ్చు. దానికి మేము ఏమి చేయగలమన్నారు. అలాగే `ఢీ` నటుడు విష్ణు ఓ వ్యక్తిపై సంచలన ఆరోపణలు చేసారు.
డబ్బింగ్ చిత్రాల ద్వారా `మా` సభ్యత్వం పొందిన ఓ జర్నలిస్ట్ కారణంగా `మా` లో వివాదాలు తలెత్తాయని అతనే ప్రధాన కారణమని కూడా ఆరోపించారు. మరి ఈ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ఎలా స్పందిస్తారో చూడాలి. ఎన్నికలు పూర్తై వారం రోజులు గడిచిపోయినా ఇంకా వివాదాలు..విమర్శలు మాత్రం శరా మామూలుగానే కొనసాగుతున్నాయి. మరి ఈ వివాదాలు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయో. గతంలోనూ ఎన్నికల సమయంలో వివాదాలు వచ్చాయి. కానీ ఎన్నికలు అయిన వెంటనే అంతా సద్దుమణిగాయి. కానీ ఈసారి సన్నివేశం మరోలా కనిపిస్తోంది.