ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నానికి ఈ రోజు మధ్యాహ్నం గుండెపోటు వచ్చిందని.....ఆయనను చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ వార్త తెలిసిన మణిరత్నం సన్నిహితులు - కోలీవుడ్ సినీ ప్రముఖులు ఆసుపత్రికి వచ్చినట్లు కూడా పుకార్లు వెలువడ్డాయి. దీంతో మణిరత్నం అభిమానులు ఆందోళన చెందారు. అయితే, తాము రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసమే ఆసుపత్రికి వచ్చామని మణిరత్నం పీఆర్ వో చెప్పారు. ఈ నేపథ్యంలో మణిరత్నం అస్వస్థత వార్తలపై సందిగ్ధత ఏర్పడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆ సందిగ్ధతకు అపోలో డాక్టర్లు తెరదించారు. మణిరత్నం ఆరోగ్య పరిస్థితిపై ఆపోలో డాక్టర్లు ప్రకటన చేశారు.
మణిరత్నానికి గుండెపోటు వారు క్లారిటీ ఇచ్చారు. కొద్దిగా గుండెల్లో నొప్పిగా అనిపించడంతో మణిరత్నం ఆసుపత్రికి వచ్చారని చెప్పారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని - ఆయన పరిస్థితి నిలకడగా ఉందని స్పష్టం చేశారు. చెకప్ లో భాగంగానే ఆయనకు పరీక్షలు నిర్వహించామని అన్నారు. ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ కాలేదని - చెకప్ కోసమే ఆసుపత్రికి వచ్చారని వెల్లడించారు. మణిరత్నం ఆరోగ్య పరిస్థితిపై వచ్చిన పుకార్లన్నీ అవాస్తవమని వైద్యులు తెలిపారు. అపోలో వైద్యుల ప్రకటనతో ఆ పుకార్లకు తెరపడినట్లయింది.