ఫస్ట్ లుక్: కదనరంగంలో మణికర్ణిక

Update: 2018-08-15 03:59 GMT
టాలెంటెడ్ టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ హిందీలో వీరనారి ఝాన్సి లక్ష్మిబాయి చరిత్రను 'మణికర్ణిక' గా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.  బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాకు KV విజయేంద్ర ప్రసాద్ స్టొరీ అందించడం విశేషం.  ఇండిపెండెన్స్ డే సందర్భంగా 'మణికర్ణిక' టీమ్ ఈ రోజు ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది.

రణరంగంలో తన బిడ్డను వీపుకు కట్టుకొని గుర్రపు స్వారీ చేస్తూ శత్రువుల మీదకు విరుచుకుపడుతున్న ఝాన్సీ లక్ష్మీ బాయిగా కంగనా లుక్ ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. 1857 లో ఝాన్సీ రాణి ఈస్ట్ ఇండియా కంపెనీ వారితో యుద్ధం చేసిన ఎపిసోడ్ ఈ సినిమాలో కీలకమైనదట.  ఫస్ట్ లుక్ చూస్తుంటే ఆ యుద్ధంలో శత్రువులను చీల్చి చెండాడే సీన్ నుంచి ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ వేసినట్టుంది.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. 'మణికర్ణిక' వచ్చే ఏడాది జనవరి 25 న రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.  రిపబ్లిక్ డే వీకెండ్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హృతిక్ రోషన్ 'సూపర్ 30' తో  పోటీ పడనుంది.



Tags:    

Similar News