ఈ స్టార్ డంకి ముందు ఎన్నో కన్నీళ్లున్నాయ్... బర్త్ డే వేడుకలో అనుష్క శర్మ భావోద్వేగం

Update: 2021-05-03 00:30 GMT
అనుష్క శర్మ అంటే సినీ స్టార్ హీరోయిన్ అనే కాదు.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వైఫ్ గా అందరికీ తెలుసు.  మోడలింగ్ నుంచి హీరోయిన్ గా మారిన అనుష్క శర్మ అనతి కాలంలోనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. నిర్మాతగా మారి పలు విజయవంతమైన చిత్రాలను కూడా నిర్మించింది. మే 31న అనుష్క శర్మ 33వ బర్త్ డే జరుపుకుంది. ఈ సందర్భంగా ఆమె తన వ్యక్తిగత  జీవితానికి సంబంధించిన పలు విషయాలను వెల్లడించి భావోద్వేగానికి గురయ్యారు.

ఆర్మీ కుటుంబానికి చెందిన అనుష్క శర్మ ముందుగా మోడలింగ్ లో రాణించి ఆ తర్వాత  18 ఏళ్ల వయసులోనే బాలీవుడ్ హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. మొదటి సినిమాలోనే బాలీవుడ్ బాద్ షా  షారుక్ ఖాన్ హీరోగా నటించిన 'రబ్ నే బనాదీ జోడి' మూవీలోఛాన్స్ దక్కించుకుంది. ఆ సినిమా విజయవంతం కావడంతో బాలీవుడ్లో ఆమెకు మంచి పేరు వచ్చింది.  అయితే ఈ సినిమా విజయవంతం అయినప్పటికీ తనకు అవకాశాలు రావడానికి మరో రెండేళ్లు ఎదుర్కొనాల్సి వచ్చిందని అనుష్క చెప్పింది.

హీరోయిన్ కాక  ముందు కాలేజ్ డేస్ లో కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్లు అనుష్క శర్మ చెప్పింది. తాను కాలేజీలో ఉండగానే మోడలింగ్ పై దృష్టి పెట్టాలని అనుకున్నానని...  అయితే ఆ సమయంలో చాలామంది 'నువ్వేమి అంత అందంగా  ఏమీ లేవు' అంటూ కామెంట్ చేసే వారని..  అలాంటి మాటలతో ఎన్నోసార్లు బాధ పడినట్లు ఆమె చెప్పారు.

 తన తొలి చిత్రం

రబ్ నే బనాదీ జోడి  సూపర్ అయినప్పటికీ అంత తొందరగా  తనకు అవకాశాలేమీ  రాలేదని, మొదటి సినిమాకు ఫిలిం పేర్  అవార్డు వస్తుందని అనుకుని ఆ వేడుకలకు హాజరయ్యానని, కానీ తనకు అవార్డు రాలేదని చెప్పారు. ఆ సమయంలో తాను దుఃఖాన్ని ఆపుకోలేక పోయానని, వేదిక వెనకాలకు  వెళ్లి ఏడుస్తుండగా అప్పుడే అక్కడికి  అమితాబ్ బచ్చన్ గారు వచ్చారని, ఆయన 'మీరు నటించిన రబ్ నే బనాదీ జోడి' చూశానని అందులో మీరు చాలా చక్కగా నటించారని చెప్పడంతో ఆయన మాటే అవార్డుగా భావించినట్లు తెలిపారు. హీరోయిన్ గా అనుష్క శర్మ మంచి పీక్ స్టేజ్ లో ఉండగానే 2017లో  విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకుంది.
    

Tags:    

Similar News