బ్రేక్ ఈవెన్ దిశగా మాస్ మహారాజ్ 'క్రాక్'

Update: 2021-01-15 06:15 GMT
మాస్ మహారాజా రవితేజ చాలా గ్యాప్ తరువాత బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాడు. 'క్రాక్' సినిమాతో సంక్రాంతి బరిలో దిగిన రవితేజ.. ఈ సీజన్ లో సూపర్ హిట్ అందుకున్నాడు. సినిమా విడుదల రోజు ఈవెనింగ్ వరకు షోస్ పడనప్పటికి 'క్రాక్' పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. 'మాస్టర్' 'రెడ్' 'అల్లుడు అదుర్స్' సినిమాల ప్రభావం ఉన్నా కూడా తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. మొత్తంగా చూసుకుంటే 'క్రాక్' మూడు రోజుల్లో 22 కోట్ల గ్రాస్ కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. 13.56 కోట్ల షేర్‌‌ ను రాబట్టిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతోంది. ఇక కేవలం 3.94కోట్ల షేర్‌ రాబడితే 'క్రాక్' బ్రేక్ ఈవెన్ అయినట్లే.

'క్రాక్' మూడో రోజు బాక్సాఫీస్ లెక్కలు చూసుకుంటే నైజాంలో 1.12 కోట్లు.. సీడెడ్‌ లో 55 లక్షలు.. ఉత్తరాంధ్రలో 29 లక్షలు.. ఈస్ట్ 22 లక్షలు.. వెస్ట్ 16 లక్షలు.. గుంటూరు 20.3 లక్షలు, కృష్ణా 16.5 లక్షలు, నెల్లూరులో 15 లక్షలు కొల్లగొట్టింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా నుంచి 44 లక్షలు.. ఓవర్సీస్ నుంచి 57 లక్షలు కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా మూడో రోజు 4.9 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. నాలుగు వరుస ప్లాప్స్ తర్వాత వచ్చిన 'క్రాక్' చిత్రం రవితేజను మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కించిందని చెప్పవచ్చు. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సరస్వతి ఫిలిం డివిజన్ బ్యానర్‌ పై ఠాగూర్ మధు నిర్మించారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో సముద్రఖని - వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. థమన్ మ్యూజిక్ అందించగా.. జీకే విష్ణు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.
Tags:    

Similar News