11 కుట్లు పడినా లెక్క చేయలేదు.. మాస్ రాజా మొండిపట్టు

Update: 2022-06-17 10:32 GMT
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కొంత మంది హీరోలు చూపించే డెడికేషన్ మామూలుగా ఉండదు అనే చెప్పాలి. ఒక సినిమాకు హీరోగా పనిచేయడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. ముఖ్యంగా యాక్షన్ సినిమాల్లో ప్రాణం పెట్టి నటించాల్సి ఉంటుంది కొన్నిసార్లు అనుకోని విధంగా గాయాలు కూడా అవుతూ ఉంటాయి.

అయితే అలా గాయాలు అయినప్పుడు కొంతమంది హీరోలు వారి ఆరోగ్యం గురించి ఆలోచించుకుని చాలావరకు రెస్ట్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ అతితక్కువ మంది హీరోలు మాత్రం అలాంటివేమీ లెక్కచేయరు.

నిర్మాతలు నష్టపోకూడదనే అలాగే మిగతా ఆర్టిస్టుల డేట్స్ కూడా క్లాష్ అవ్వకూడదని ఆలోచించి గాయపడిన సరే షూటింగ్లో పాల్గొనడానికి ఆసక్తిని చూపిస్తారు  ఇక అలాంటి అతి తక్కువ మంది హీరోలలో మాస్ మహారాజా రవితేజ కూడా ఉన్నారు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల తీవ్రంగా గాయపడి కూడా సినిమా షూటింగ్ ను చేసేందుకు ముందుకు వచ్చారు. రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించినప్పటికి కూడా ఒక సినిమా గురించి ఆలోచించి వర్క్ చేయడానికి ఒప్పుకున్నాడు.

మాస్ మహారాజా రవితేజ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కూడా చాలా బలంగా ఉండబోతున్న ట్లు తెలుస్తోంది. వంశీ ఆకెళ్ల ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ఒక యాక్షన్ ఎపిసోడ్ కోసం రవితేజ చాలా హార్డ్ వర్క్ చేసినట్లు తెలుస్తోంది.

ఎలాంటి డూప్ లేకుండా నటించడంతో ఒక సీన్ లో తీవ్రంగా గాయమైంది. మోకాలికి దాదాపు 11 కోట్లు కూడా పడ్డాయట. ఇక వైద్యులు రెండు వారాల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని కూడా సూచించారట. చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఆలోచించి లేటెస్ట్ షెడ్యూల్ ని వాయిదా వేయాలని అనుకున్నారు.

కానీ రవితేజ తన గురించి షూటింగ్ ఆపకూడదు అని ఆలోచించి రెండు రోజుల్లో సినిమా షూటింగ్ మొదలు పెట్టాలి అని ఆర్డర్ వేసినట్లు తెలుస్తోంది. గతంలో మెగాస్టార్ చిరంజీవి మహేష్ బాబు ప్రభాస్ కూడా గాయాలను లెక్కచేయకుండా ఇదే తరహాలో షూటింగ్లో పాల్గొన్నారు. అందుకే వీరికి ఇండస్ట్రీలో స్టార్స్ గా మంచి పేరు ఉంది.
Tags:    

Similar News