మా అమ్మాయి కాలేజీలో చేరాకే...

Update: 2015-07-02 01:30 GMT
తల్లి క్యారక్టరుంది.. అత్తగా యాక్ట్‌ చేయాలి.. పొగరున్న సిస్టర్‌ రోల్‌.. ఓ ఏడెనిమిది ఏళ్ల వయస్సులో ఉన్న పిల్లలున్న మాజీ హీరోయిన్స్‌ ఎవరినైనా ఈ ప్రశ్న అడిగితే.. సీన్‌ ఎలా ఉంది?? మేం నటిస్తాం. నాకు ఓకె. ఇదిగో ఫ్లయిట్‌ ఎక్కేస్తున్నా. అంటూ ఎగబడిపోతున్నారు. ఇక్కడైతే నదియా, మధుబాల, గౌతమి, రేవతి.. అందరిదీ ఇదే సిట్యుయేషన్‌.. బాలీవుడ్‌లో మాధురి, శ్రీదేవి, జూహీ చావ్లా, ట్వింకిల్‌ ఖన్నా, రవీనా టాండన్‌లనది కూడా సేమ్‌ సీన్‌. కాని ఓ సీనియర్‌ అవార్డ్‌ విన్నింగ్‌ హీరోయిన్‌ మాత్రం.. అంత సీన్‌ లేదు.. మా అమ్మాయి కాలేజీలో చేరాకే నేను యాక్టింగ్‌వైపు వస్తాను అంటోంది.

అప్పట్లో తెలుగులో ఆపద్భాంధవుడు అనే సినిమాలో మెగాస్టార్‌ సరసన మెరిసిన టీన్‌ మిస్‌ ఇండియా మీనాక్ష శేషాద్రి ఈ మాటనేసింది. 90లలో కొన్ని సినిమాలు చేసి ఇక హరీష్‌ మైసూర్‌ అనే వ్యక్తి పెళ్లాడి అమెరికా చెక్కేసింది. నిన్ననే నటుడు రిషి కపూర్‌ ఇంటికొచ్చి సందడి చేసింది. ఇంతకీ ఈ భామ వయస్సు మన మధుబాల టైపులో ఏ 40 అనుకునేరు.. ఈమె వయస్సు 51. అయినాసరే సినిమాల్లో వస్తారా అంటే అబ్బే రాను అంటోంది. మా అమ్మాయిలు ఇంకా కాలేజీలో చేరలేదు.. చేరాకనే ఆలోచిస్తా అనేసింది. మన మాజీ హీరోయిన్లు పిల్లలు సెవెంత్‌ క్లాస్‌ చదువుతుంటేనే ముఖానికి రంగేసుకోవాలని ఆరాటపడుతుంటే.. మీనాక్షి మాత్రం ఏజ్‌ అయిపోతున్నా కూడా అస్సలు తొందరపడట్లేదు. కాకపోతే ఆమెను చూస్తే ఎవ్వరూ 51 సంవత్సరాలు ఉంటాయని అనుకోరు. 1981లో 17 ఏళ్ళకు మిస్‌ ఇండియా టీన్‌ గెలిచిందంటే.. ఆమె ఏజ్‌ ఎంతో మీరే లెక్కపెట్టుకోండి. అయినా ఆవిడకు యాక్టింగ్‌ మీద ఆశలేదు.

Tags:    

Similar News