పరిశ్రమని మెగా హీరోలే ఏలేస్తున్నారు. కేవలం ఈ ఒక్క ఫ్యామిలీ నుంచే డజను హీరోలు పరిశ్రమని ఆక్రమించేశారన్న విమర్శ ఉంది. ఆ విమర్శకు తగ్గట్టే 2014 వరకూ ఈ హీరోల హవా సాగింది. వరుసగా బాక్సాఫీస్ హిట్లతో మోతెక్కించారు. అయితే 2015 మాత్రం మెగా ఇయర్ కానేకాదు. ఈ ఏడాది మెగా హీరోలకు చుక్కలు చూపించింది. అసలు హిట్టన్నదే ఇవ్వని సంవత్సరమిది. కొందరు బాక్సాఫీస్ వద్ద యావరేజ్ - ఎబౌ యావరేజ్ అన్న మాటతోనే సరిపెట్టుకోవాల్సొచ్చింది. ఓ సారి డీటెయిల్స్ లోకి వెళితే..
ఈ ఏడాది ఎంతో ప్రామిస్సింగ్ మూవీ అనుకున్న బ్రూస్ లీ అట్టర్ ఫ్లాపైంది. ఈ మూవీలో నటించడం వల్ల రామ్ చరణ్ కి బ్యాడ్ నేమ్ వచ్చింది. మెగాస్టార్ ప్రత్యేక పాత్ర కూడా ఈ మూవీని ఆదుకోలేకపోయింది. ఇకపోతే మరో ప్రామిస్సింగ్ హీరో బన్ని కూడా ఈ ఏడాదిలో అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోయాడు. ఏడాది ఆరంభంలోనే వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి బాక్సాఫీస్ వద్ద 50 కోట్ల వసూళ్లు సాధించినా పంపిణీదారులకు మాత్రం నష్టాలొచ్చాయి. ఎబౌ యావరేజ్ సినిమా మాత్రమేనని విశ్లేషకులు తేల్చేశారు.
పవన్ కల్యాణ్ నటించిన గోపాల గోపాల బాక్సాఫీస్ వద్ద యావరేజ్ అన్న టాక్ తెచ్చుకుంది. సాయిధరమ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకతవంలో వచ్చిన సుబ్రమణ్మం ఫర్ సేల్ యావరేజ్ సినిమా అన్న టాక్ తెచ్చుకుంది. రొటీన్ కంటెంట్ తో ఓవర్సీస్ లో బోల్తా కొట్టింది. ఇక వరుణ్ తేజ్ నటించిన రెండు క్రేజీ ప్రాజెక్టులు రిలీజయ్యాయి. కంచె క్రిటికల్ గా ప్రశంసలు అందుకుంది. లోఫర్ మాస్ లో ఫర్వాలేదన్న టాక్ తెచ్చుకుంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఆశించినంత వసూళ్లు సాధించలేదు. అయితే వరుణ్ తేజ్ నటుడిగా పరిణతి చెందాడు అన్నపాజిటివ్ సైన్ కనిపించింది.
ఉన్నంతలో బన్నికి ఏడాది చివరిలో వచ్చిన రుద్రమదేవి సినిమా కాస్తంత ఊరటనిచ్చింది. ఇందులో గోనగన్నారెడ్డి క్యారెక్టర్ కి మంచి పేరొచ్చింది. కానీ కాస్ట్ ఫెయిల్యూర్ వల్ల సినిమా ఫ్లాప్ రిజల్ట్ నే అందుకుంది. అందుకే ఈ సంవత్సరాన్ని మెగా ఫ్యామిలీ మర్చిపోవడమే బెటర్.