స్టార్ హీరోయిన్ అర్హత ప్రశ్నించిన నటి

Update: 2020-07-02 05:30 GMT
ఇటీవల కాలంలో నెపోటీజమ్ పై సోషల్ మీడియా ద్వారా చేస్తున్న కంగనా చేస్తున్న విమర్శలు ఇంకా ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఆమె చేస్తున్న ఆరోపణల కారణంగా స్టార్ హీరోలు సైతం ఏమి మాట్లాడలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో కంగనా పై తమిళ నటి మీరా మిథున్ సంచలన విమర్శలు గుప్పించింది. ఆమె అర్హతను మీరా మిథున్ ప్రశ్నించింది.

ప్రస్తుతం కంగనా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ లో నటిస్తుంది. ఆ సినిమాలో నటించే అర్హత కంగనాకు లేదు అంటూ మీరా మిథున్ ఆరోపించింది. జయలలిత బయోపిక్ కు ఆమెను ఎలా ఎంపిక చేశారు. కోలీవుడ్ లోని రాజకీయాల కారణంగా అర్హత లేని కంగనా జయలలిత పాత్రను చేస్తున్నట్లుగా మీరా మిథున్ ఆరోపించింది.

నా రాష్ట్ర ముఖ్యమంత్రి పాత్రను పోషించేందుకు నీవు ఎవరు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈమె చేసిన ఆరోపణలు ప్రస్తుతం తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. మరి కంగనా ఈ విషయమై ఎలా స్పందిస్తుందో చూడాలి.
Tags:    

Similar News