స్టార్ కమెడియన్ ఎమ్మెస్ నారాయణ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన మలేరియా జ్వరంతో బాధపడుతున్నారని సమాచారం. సోమవారం ఆయన్ని విజయవాడలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో ప్రాధమిక చికిత్స చేయించి, అదే రోజు రాత్రి హైదరాబాద్ కిమ్స్‌కి తరలించారు. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఎమ్మెస్‌కి చికిత్స జరుగుతోంది. ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఎలాంటి ఇబ్బంది లేదని కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఎమ్మెస్ నారాయణకు ఒక కూతురు. పేరు శశికిరణ్ నారాయణ.. ఇటీవలే సాహెబాసుబ్రహ్మణ్యం అనే చిత్రానికి దర్శకత్వం వహించారు.
అలాగే ఎమ్మెస్ నారాయణ తనయుడు గతంలో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఎమ్మెస్ నటించిన దూకుడు, అత్తారింటికి దారేది, బాద్‌షా వంటి చిత్రాలు బ్లాక్‌బస్టర్ హిట్స్ అయ్యాయి. అలాగే అతడు నటించిన పటాస్, రేయ్ తదితర చిత్రాలు రిలీజ్‌లకు రెడీ అవుతున్నాయి. ఉన్నట్టుండి మలేరియా ఇబ్బంది పెట్టడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కొన్ని షూటింగ్ షెడ్యూల్స్‌ని ఈ కారణంగా మార్చుకోవాల్సి వచ్చింది. త్వరగా ఎమ్మెస్ కోలుకోవాలని, షూటింగుల్లో బిజీ అవ్వాలని తుపాకి ఆకాంక్షిస్తోంది.