టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశం రావడం.. ఏ డైరెక్టర్ కయినా గొప్ప ఛాన్సే. తన పేరు, ఇమేజ్ తోనే మూవీని సగం హిట్ చేసేయగల సత్తా ఉన్న యాక్టర్. ఇండియాలోనే కాదు.. ఫారిన్ కంట్రీస్ లోనూ మహేష్ మూవీ అంటే.. కలెక్షన్లు సునామీలా వచ్చిపడుతుంటాయి. అందుకే మేకర్స్ కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేస్తుంటారు. ఏ చిన్న మిస్టేక్ కి అవకాశం లేకుండా జాగ్రత్త పడుతుంటారు.
ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాలతో బ్రహ్మోత్సవం చిత్రం చేస్తున్న సూపర్ స్టార్.. ఇది పూర్తి కాగానే మురుగదాస్ ప్రాజెక్ట్ పైకి వెళ్లిపోతాడు. 2016 ఏప్రిల్ చివర్లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఇంకా నాలుగు నెలల సమయం ఉన్నా సరే, ఈ ప్రాజెక్ట్ పై మురుగదాస్ చాలా కేర్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు తాను సోనాక్షి సిన్హాతో తీసిన బాలీవుడ్ మూవీ అకీరా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నా.. మరోవైపు మహేష్ సినిమాపై కూడా అలర్ట్ గా ఉన్నాడు.
మహేష్ బాబుతో షూటింగ్ స్టార్ట్ చేసే లోపే.. మొత్తం స్క్రిప్ట్ అంతా చేతిలో ఉండాలన్నది మురుగదాస్ ఆలోచనగా చెబ్తున్నారు. ఎందుకంటే.. ఇప్పటివరకూ టాలీవుడ్ లో అత్యంత భారీ బడ్జెట్(బాహుబలి తప్ప) 110 కోట్ల రూపాయలతో మురుగదాస్-మహేష్ మూవీ తెరకెక్కనుంది. ఏచిన్న మిస్టేక్ - ఆలస్యం లేకుండా.. పక్కా ప్లానింగ్ తో ఈ చిత్రాన్ని కంప్లీట్ చేసేందుకు అన్ని సన్నాహాలు చేసుకుంటున్నాడు మురుగదాస్. ఎన్వీ ప్రసాద్ - టాగూర్ మధులు ఈ చిత్రానికి నిర్మాతలు.