మ్యూజిక్ డైరెక్టర్ కమ్ యాక్టర్..డైరెక్టర్ ఆర్ . పి పట్నాయక్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాలకు సంగీతం అందించిన ఆర్ . పి దర్శకుడిగానూ సత్తా చాటే ప్రయత్నం ప్రశంసనీయం. 'అందమైన మనసులో'..'బ్రోకర్'..'ప్రెండ్స్ బుక్'..'తులసీ దళం' లాంటి చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఓ గుర్తింపును దక్కించుకున్నారు.
అయితే దర్శకుడిగా మాత్రం బిజీ కాలేకపోయారు. ఆయన చివరిగా 'మనలో ఒకడు' అనే సినిమా చేసారు. ఇది విడుదలై ఆరేళ్లు అవుతుంది. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. తాజాగా ఆయన 'కాఫి విత్ ఏ కిల్లర్' అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇది ఓ కాఫి షాప్ చుట్టూ తిరిగే కాన్సెప్ట్ బేస్ట్ చిత్రంలో కనిపిస్తుంది. దర్శకుడు అనిల్ రావిపూడి చేతుల మీదుగా రిలీజ్ అయిన ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.
రొటీన్ థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా కనిపిస్తుంది. అనీల్ సైతం మెచ్చిన ట్రైలర్ గా నిలచింది. ట్రైలర్ ని ఉద్దేశించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 'కోవిడ్ తర్వాత కంటెంట్ ఉన్న సినిమాలకే ఎక్కువ స్కోప్ కనిపిస్తుంది. ఆ ఛాన్స్ ఈ సినిమాలో ఉంది. ఒక కాఫీ షాపు చుట్టు ఇంత జరుగుంతా? అన్నది ట్రైలర్ లో ఆసక్తికరంగా మలిచారు. చాలా ఎంగేజింగ్ గా ఉంది.
ఇందులో ఆర్ పీ గారే హీరో అంటాను. ఎందుకంటే కథే హీరోగా కనిపిస్తుంది. ఆయన ఏ క్రాప్ట్ అయినా అద్భుతంగా డీల్ చేయగలరు. టీనేజ్ లో ఉన్నప్పుడు ఆయన పాటలే ఎక్కువగా వినేవాడిని. ఆపాటలు లేకుంటే టీనేజ్ అంతే ఏమైపోయేదో. ఆ యన పాటలు అంత ఇంప్రెస్ చేస్తాయన్నా'రు.
'ఓటీటీ వచ్చాక జనాలు థియేటర్లో సినిమా చూడాలన్న ఆలోచనలో మార్పులొచ్చాయి. కొత్త గా చెబితే గానీ జననాల్ని థియేటర్ కి రప్పించలేమని అర్ధమైంది. మా సినిమాలో అంత స్టప్ ఉంది. నా ఆలోచనకి సెవెన్ హిల్స్ సతీష్ తోడవ్వడంతోనే ఇది కార్యరూపం దాల్చింది. సెట్ లో తన ఆవేశాన్ని కంట్రోల్ చేయడం కొంచెం కష్టమైంది.
ఆయన అలా ఉండటం వల్లే సినిమా ఇంతవరకూ రాగలిగింది. మరో రెండు సినిమాలు మా కాంబోలో రాబోతున్నాయని ఆర్ . పి తెలిపారు. ఈసినిమా ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మొత్తానికి ఆర్ పీ ఈ ఏడాది నుంచి మళ్లీ దర్శకుడిగా బిజీ అవుతున్నట్లు కనిపిస్తుంది. ఈసినిమా హిట్ అయితే మరికొన్ని సినిమాలు చేయడానికి ఛాన్స్ ఉంది. ఇదే నిర్మాతతో మరో రెండు సినిమాలు లాక్ చేసిన నేపథ్యంలో ఛాన్సుల పరంగా స్పీడందుకున్నట్లు కనిపిస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.