నయన్‌ ప్రేమికుడు బాగానే తీశాడే

Update: 2015-10-10 11:30 GMT

Full View
దక్షిణాది సినీ ఇండస్ట్రీల్లో అగ్రతారగా వెలుగుతున్న నయనతార.. తన లవ్ స్టోరీని బైటకు చెప్పలేదు. గతంలో ఇలా చెప్పి తీరా అవి ఫెయిలవడంతో నవ్వులపాలైంది నయన్. అందుకే ఇప్పుడు సీక్రెట్ గా ప్రేమకథ నడిపిస్తోంది. సీక్రెట్ అని నయనతార అనుకుంటోంది కానీ.. ఈ భామ లవర్ విఘ్నేష్ అని అందరికీ తెలిసిపోయింది. ఇతగాడేం అనామకుడు కాదు. గతంలో లిరిసిస్ట్‌ కమ్‌ రచయిత అయిన విఘ్నేష్.. తర్వాత డైరెక్టర్ గా మారాడు.

శింబుతో కలిసి పోడా పోడీ అనే హిట్ మూవీతో కోలీవుడ్ లో దర్శకుడిగా మారాడు. ఆ తర్వాత విఘ్నేష్ చేపట్టిన ప్రాజెక్ట్ నానుం రౌడీ దాన్.. ఇందులో విజయ్ సేతుపతి - నయనతార హీరో హీరోయిన్లు. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే.. ఈ దర్శకుడు, మన హీరోయిన్ నయన్.. లవ్వులో పడిపోయారు. ఇంతకీ విషయం ఏంటంటే ఇప్పుడీ మూవీకి సంబంధించిన ట్రైలర్ విడుదలై టాక్ ఆఫ్ తమిళనాడు అయిపోయింది. కంటెంట్, విజువల్స్, చూపించిన విధానం, హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ.. ఇలా ఒకటేంటి ప్రతీ విషయంలోనూ సూపర్బ్ గా ఉన్నాయనే ప్రశంసలు దక్కుతున్నాయి. దీంతో విఘ్నేష్ ఇప్పుడు మళ్లీ వార్తల్లో వ్యక్తి అయిపోయాడు.

ధనుష్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుండగా.. అనిరుధ్ అందించిన మ్యూజిక్ ఆకట్టుకుంటోంది. తన ప్రేమికుడికి ఈ స్థాయిలో ప్రశంసలు దక్కుతుండడంతో.. నయన్ కూడా ఫుల్లు హ్యాపీగా ఉంది. సినిమాకి డైరెక్టర్, తన రియల్ లైఫ్ హీరో కాబోతోన్న విఘ్నేష్ కి సూపర్ గిఫ్ట్ ఇవ్వబోతోందిట. ఏమయ్యుంటుందంటారు ?
Tags:    

Similar News