శ్రీరెడ్డి ఇష్యూ మొదలైన తర్వాత ఇండస్ట్రీ నుంచి తమ గొంతును బలంగా వినిపిస్తున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. ఇవాళ నాగబాబు ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్లు అందరూ సమర్ధించే విధంగా ఉండటంతో ప్రస్తుతం సినిమా ప్రేమికుల మధ్య ఇదే చర్చగా మారింది. ప్రతి ఒక్కరికి టాలీవుడ్ మీదే రాళ్ళు వేయడం ఫ్యాషన్ గా మారిపోయిందని ఇప్పుడు ఉన్న స్టార్ హీరొయిన్లు ఎవరు కాస్టింగ్ కౌచ్ లో బాధితులు కారని స్పష్టం చేసారు నాగబాబు. మీడియా కనక రాజకీయ ప్రలోభాలకు లొంగిపోతే అమాయకుడిని విలన్ గా నక్కజిత్తులు వేసేవాడిని మేధావిగా చూపించగలదని అంత శక్తివంతమైన దీన్ని ఇలాంటి వాటికి వాడకండి అని రిక్వెస్ట్ చేసారు. సినిమాలు చూడటం వల్లనో లేక చేయటం వల్లనో మీరు చెడిపోతున్నారు అనుకుంటే చూడటం మానేయండి. చెడు గురించి మాత్రమే మాట్లాడే మీరు మంచి గురించి మాత్రం నోరు విప్పరని పంచ్ వేసారు.
ఇప్పుడు తాను మాట్లాడిన మాటలు కూడా ఫాన్స్ ట్రాల్ చేస్తారని అది పబ్లిక్ గా వాళ్ళ హక్కని అంతే తప్ప రోజు లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయే దాకా ఎవరు కామెంట్ చేసారు ఎవరు ఏమన్నారు అనే దాని గురించే చూసే తీరిక ఇక్కడ ఎవరికి ఉండదన్నారు. క్యాష్ కమిటీ అన్ని సమస్యల పైన దృష్టి పెడుతుందని తాను నిర్మాతల మండలితో కూడా మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఇక దీని గురించి పరిశ్రమ తరఫున మాట్లాడడానికి తాను చాలని చిరంజీవి-బాలకృష్ణ-నాగార్జున-వెంకటేష్ ఇంకా ఇతర యూత్ హీరోలు రావాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. కో ఆర్డినేటర్ వ్యవస్థ లేకుండా చేసే ప్రయత్నం తప్పకుండ జరుగుతుందని నొక్కి చెప్పారు.
ఇక శ్రీరెడ్డి చాలా అసభ్యకర రీతిలో చేసిన కామెంట్ గురించి అమ్మతో చెప్పానని ఆవిడ నవ్వి ఊరుకున్నారు తప్ప ఏమి అనలేదని నాగబాబు చెప్పడం గమనార్హం. ప్రెస్ మీట్ లో దీని గురించి మాట్లాడతాను అని చెప్పినప్పుడు ఆ అమ్మాయి గురించి పర్సనల్ గా ఎలాంటి కామెంట్ చేయవద్దని చెప్పి మరీ అమ్మ పంపారని అందుకే ఎలాంటి వ్యక్తిగత దూషణ తాను చేయనని స్పష్టం చేసారు నాగబాబు. విషయం తెలిసినప్పుడు చాలా కోపం వచ్చిందన్న నాగబాబు మౌనాన్ని అపార్థం చేసుకున్నారని తప్పకుండా సమాధానం వచ్చి తీరుతుందని స్పష్టం చేసారు. తప్పు చేస్తే అది పబ్లిక్ గా ఒప్పుకునే దమ్మున్న వాడు నా తమ్ముడు అన్నప్పుడు మీడియా నుంచి కూడా అప్లాజ్ దక్కడం విశేషం.మౌన దీక్ష చేసిన మాధవి లతతో పాటు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పిన నాగబాబు స్పీచ్ ఫాన్స్ నుంచే కాదు శ్రీరెడ్డి ఎపిసోడ్ ని ముందు నుంచి ఫాలో అవుతున్న వాళ్ళను కూడా బాగా ఆకట్టుకుంది.