కింగ్ నాగ్ ఇమేజ్ మరీ అంత మసకబారిందా?

Update: 2020-04-11 17:30 GMT
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో కింగ్ నాగార్జున ఒకరు. అయితే ఈ మధ్య నాగార్జున సినిమాలకు ఏమాత్రం ఆదరణ దక్కడం లేదు. సినిమాలు ఫ్లాప్ కావడం సహజమే కానీ ఒకదాన్ని మించి మరొకటి డిజాస్టర్లుగా నిలవడం అనేది మాత్రం నాగార్జున అభిమానులకు కూడా మింగుడు పడడం లేదు. నాగార్జున చివరి సినిమా 'మన్మథుడు 2' విషయమే తీసుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఆ సినిమామా లోని అడల్ట్ కంటెంట్ నాగార్జునకు చాలా చెడ్డ పేరు తీసుకొచ్చింది. ఆ సినిమాను కుటుంబ కథా చిత్రంగా ప్రచారం చేయడం చాలా మందికి నచ్చలేదు.

ఆ సినిమా దెబ్బకు హీరోయిన్ గా నటించిన రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ కు ఒక్కసారిగా సడన్ బ్రేక్ పడింది. అప్పటివరకు ఉన్న అరకొర అవకాశాలు కూడా పూర్తిగా ఆగిపోయాయి. ఈ 'మన్మధుడు 2' సంగతి పక్కన పెడితే నాగార్జున పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తూ ఒక సినిమా మొదలుపెట్టారు. వయాకామ్ మీడియా వారితో ఉన్న అగ్రిమెంట్ ప్రకారం నాగార్జున ఈ సినిమా టేకప్ చేశారట. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే.. సినిమా పేరు గురించి సాధారణ ప్రేక్షకులనే కాదు.. అక్కినేని అభిమానులు అడిగినా చెప్పలేకపోతున్నారు. అంతెందుకు నాగార్జున చేస్తున్న ఈ సినిమా టైటిల్ ఏంటని ఇండస్ట్రీలోని వారిని అడిగినా కూడా గుడ్లు తేలేస్తున్నారు.

ఒక స్టార్ హీరో సినిమా టైటిల్ విషయంలో ఇలా జరగడం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. నాగ్ నటిస్తున్న ఈ సినిమా టైటిల్ కంటే ఈమధ్య ఆయన కరోనా ఛారిటీకి ప్రకటించిన విరాళం న్యూస్ ఎక్కువగా పాపులర్ అయ్యిందని ఫిలింనగర్లో ఒకటే జోకులు వినిపిస్తున్నాయి. సినిమా మేకర్లు పబ్లిసిటీ పై అశ్రద్ధ వహిస్తే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయని కామెంట్లు జోరుగా వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News