అక్కినేని నాగార్జున ప్రధానంగా తెలుగు నటుడే కానీ.. ఆయన్ని బహుభాషా నటుడిగా కూడా చెప్పొచ్చు. హిందీలో ‘శివ’.. ‘ఖుదాగవా’.. ‘ద్రోహి’.. ‘అంగారే’.. లాంటి సినిమాలు చేశాడు. తమిళంలో కూడా ‘రక్షకుడు’లో నటించాడు. ఐతే ఆయన గత పది పదిహేనేళ్లలో తెలుగు భాషకే పరిమితం అయిపోయారు. వేరే భాషల్లో నటించట్లేదు. ఐతే ఇప్పుడు నాగ్ ఓ కొత్త భాషలోకి అడుగుపెడుతున్నాడు. ఆ భాష.. మలయాళం. సీనియర్ దర్శకుడు ప్రియదర్శన్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కపోయే ‘మరాక్కర్’ అనే సినిమాలో నాగ్ ఓ కీలక పాత్ర చేయబోతుండటం విశేషం. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూడా నటిస్తాడట. ఈ చిత్రాన్ని ఇండియా అంతటా పెద్ద స్థాయిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఓ ప్రముఖ తమిళ నటుడిని ఇంకో పాత్రకు తీసుకోవాలనుకుంటున్నారు.
ప్రియదర్శన్ తో నాగార్జున తెలుగులో ‘నిర్ణయం’ సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఆయన తనయురాలు కళ్యాణి ప్రియదర్శన్ ను ‘హలో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం చేసింది కూడా నాగార్జునే. ఇలా వాళ్లిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఈ క్రమంలోనే నాగార్జునను మలయాళ తెరకు పరిచయం చేస్తున్నాడు ప్రియదర్శన్. నిజానికి నాగ్ కు ఇప్పటికే మలయాళం నుంచి ఒక భారీ ఆఫర్ ఉంది. మోహన్ లాల్ హీరోగా మహాభారత కథతో తెరకెక్కించాలని భావిస్తున్న మెగా ప్రాజెక్టులో నాగార్జునకు కర్ణుడి పాత్రను ఆఫర్ చేయగా.. ఆయన ఇంకా ఏ విషయం తేల్చలేదు. ఇక నాగ్ టాలీవుడ్ కెరీర్ విషయానికొస్తే ఆయన రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నటించిన ‘ఆఫీసర్’ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం నానితో కలిసి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ చేస్తున్నాడు నాగ్. దీని తర్వాత నాగ్ నటించేది ‘మరాక్కర్’లోనే అని సమాచారం.