రజినీ పార్టీకి గ్లామర్ వచ్చేస్తోంది

Update: 2017-05-26 04:40 GMT
సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. పాలిటిక్స్ గురించి మాట్లాడినా.. దేవుడు ఆదేశిస్తే అనే మెలిక పెట్టారు రజినీ. అయితే.. ప్రధాని నరేంద్ర మోడీతో డిస్కషన్స్ చేయనున్నారనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. ఈ ఏడాది రజినీ పొలిటికల్ పార్టీ అనౌన్స్ మెంట్ కూడా వస్తుందని అంటున్నారు.

అయితే.. రజినీకాంత్ పార్టీ పెడితే మాత్రం సినీ గ్లామర్ బోలెడంత జతయిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. పార్టీ ప్రకటించాక బోలెడుమంది రజినీ వెంట నిలుస్తారనే సంగతిని అంచనా వేయచ్చు. కానీ ఇంకా ఊహాగానాల మధ్య ఉండగానే.. రజినీకాంత్ పార్టీలో చేరతానని బొద్దుగుమ్మ నమిత చెప్పేసింది. అప్పట్లో బీజేపీలో చేరేందుకు ఈమె ప్రయత్నాలు చేసింది కానీ.. అవేవీ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు ముందుగా తనకో సీటు బుక్ చేసుకోవడం కోసం.. అడ్వాన్స్ గానే రజినీ జపం చేసేస్తోంది. ఇక సూపర్ స్టార్ తో కలిసి ముత్తు మూవీలో అలరించిన బ్యూటీ మీనా కూడా రజినీ నామస్మరణ మొదలుపెట్టేసింది.

ఆయన ఎప్పుడు పార్టీ పెట్టినా సరే.. వెంటనే చేరిపోతానని చెప్పింది మీనా. ఇప్పటివరకూ పార్టీపై ఎలాంటి ప్రకటనలు లేకపోయినా.. ఈ ఏడాది పంద్రాగస్టున రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై అనౌన్స్ మెంట్ రావచ్చనే అంచనాలు కోలీవుడ్ నుంచి వినిపిస్తున్నాయి. ఇందుకోసం ఏర్పాట్లు చేసేందుకు ఇప్పటికే ఓ టీం ను కూడా ఏర్పాటు చేసుకున్నారట రజినీకాంత్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News