ఏ కుటుంబానికి కూడా ఎదురుకాని విషాదం సినీ నటుడు కల్యాణ్ రామ్ ఇంట గతంలో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఒకటి కాదు.. రెండుసార్లు ఒకే తరహాలో రోడ్డు ప్రమాదంలో అన్నను.. నాన్నను కోల్పోవటం అంటే ఆ కోత మామూలుగా ఉండదు. రెండు సార్లు తమ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చిన రోడ్డు ప్రమాదాలపైన తాజాగా కల్యాణ్ రామ్ విలువైన మాటల్ని చెప్పారు.
హైదరాబాద్ లో నిర్వహించిన రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా కల్యాణ్ రామ్ పాల్గొన్నారు. చిన్నపాటి నిర్లక్ష్యమే ప్రాణాల్ని తీస్తుందని చెప్పారు. 2014లోనూ 2018లోనూ తన అన్నను.. తన తండ్రిని కోల్పోయిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రాణం కంటే మించింది మరేమీ లేదని.. రోడ్డు మీద వెళ్లేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ ను పాటించాలని కోరారు. మిగిలిన సందర్భాల్లో సెలబ్రిటీలు చెప్పే మాటలు చాలానే ఉంటాయి.
కానీ.. తనకు ఎదురైన అంతులేని విషాదాన్ని మోస్తూ.. రోడ్డు మీద వాహనాన్ని డ్రైవ్ చేసేటప్పుడు ఎలా ఉండాలన్న విషయాన్ని చెప్పిన కల్యాణ్ రామ్ మాటలు నిజంగానే బంగారు కొండల్లాంటివి. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని.. సిగ్నల్స్ దగ్గర ఒక్క నిమిషం ఆగి వెళ్లటం చాలా అవసరమన్న కల్యాణ్ రామ్ మాటల్నిఅందరూ తప్పక వినాల్సిందే.