అమ్మాయిలు నో అంటే కాస్టింగ్‌ కౌచ్‌ ఉండనే ఉండదు

Update: 2020-05-25 13:00 GMT
సినిమా పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌ అనేది సర్వ సాదారణం అని చాలా మంది అంటూ ఉంటారు. ఆఫర్లు రావాలంటే కొన్ని సార్లు ఆత్మాభిమానం పక్కన పెట్టాల్సిందే అంటూ బాహాటంగా కొందరు స్టార్‌ హీరోయిన్స్‌ కూడా గతంలో వ్యాఖ్యలు చేశారు. తాజాగా కాస్టింగ్‌ కౌచ్‌ పై బిగ్‌ బాస్‌ బ్యూటీ నందిని రాయ్‌ ఆసక్తికర కామెంట్స్‌ చేసింది. కాస్టింగ్‌ కౌచ్‌ కు పూర్తి కారణం అమ్మాయిలే అంటూ ఆశ్చర్యకరంగా కామెంట్స్‌ చేసింది.

తాజాగా నందిని రాయ్‌ ఈ విషయమై మాట్లాడుతూ... కాస్టింగ్‌ కౌచ్‌ కు ఎవరైనా ప్రయత్నించిన సమయంలో అమ్మాయిలు నో అంటే ఆ విషయం అక్కడితో ముగుస్తుంది. అమ్మాయిలు నో చెబితే ఎవరు ఏం చేయలేరు. ఇండస్ట్రీలో ఒకరిని ఒకరు బలవంత పెట్టే పరిస్థితి అస్సలు ఉండదు అనేది తన అభిప్రాయంగా చెప్పుకొచ్చింది. కాస్టింగ్‌ కౌచ్‌ అనేది పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి చెందినదిగా అందరు అనుకుంటున్నారు. కాని అసలు విషయం ఏంటీ అంటే ఇది అన్ని రంగాలకు విస్తరించిందని చెప్పుకొచ్చింది.

నాకు ఉన్న ఐటీ ఫ్రెండ్స్‌ ద్వారా తెలిసిన విషయం ఏంటీ అంటే కాస్టింగ్‌ కౌచ్‌ విషయంలో సినిమా పరిశ్రమ చాలా బెటర్‌ అన్నట్లుగా ఉందని చెప్పుకొచ్చింది. అన్ని రంగాల్లో కూడా అమ్మాయిలను వాడేసుకోవాలని కొందరు ప్రయత్నిస్తారు. ఆ సమయంలో అమ్మాయిలు నో చెబితే ఎవరు అంతకు మించి మరో అడుగు వేయరి నందిని రాయ్‌ అభిప్రాయం వ్యక్తం చేసింది. నందిని రాయ్‌ సోషల్‌ మీడియాలో చేసిన ఈ వ్యాఖ్యలను చాలా మంది సమర్ధిస్తున్నారు.

Tags:    

Similar News