యువ కథానాయకులు నారా రోహిత్.. శ్రీవిష్ణు చాలా మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే. ఐతే ఆశ్చర్యకరంగా ఈ ఇద్దరు మిత్రులు ఒకే రోజు బాక్సాఫీస్ పోరుకు సై అన్నారు. ఈ శుక్రవారం రోహిత్ సినిమా ‘బాలకృష్ణుడు’తో పాటు శ్రీవిష్ణు మూవీ ‘మెంటల్ మదిలో’ కూడా రిలీజైంది. ఐతే తమ సినిమాలు పోటీ పడ్డాయి కాబట్టి వాళ్లేమీ శత్రువుల్లా మారిపోలేదు. ఒకరి సినిమా ఆడాలనే ఇంకొకరు కోరుకుంటున్నారు. శ్రీవిష్ణుకు ముందు నుంచి సపోర్ట్ ఇస్తున్న నారా రోహిత్.. ‘మెంటల్ మదిలో’ గురించి అందరి దగ్గరా చెబుతూ ఆ సినిమా బాగా ఆడాలని ఆకాంక్షిస్తుండటం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. విశేషం ఏంటంటే.. ‘మెంటల్ మదిలో’లో రోహిత్ చిన్న క్యామియో కూడా చేశాడు.
ఈ సినిమా క్లైమాక్సులో రోహిత్ కనిపిస్తాడు. హీరోయిన్ హీరోకు చెప్పకుండా బస్సులో వైజాగ్ వెళ్లిపోతుంటే.. హీరో తన తండ్రితో కలిసి ఆమెను చేజ్ చేసి పట్టుకుంటాడు. హీరో హీరోయిన్ మధ్య సంభాషణ ముగిసి కథ సుఖాంతం అయ్యాక బస్సులో వెనుక సీట్లో రోహిత్ ను చూపిస్తారు. అతడి పక్కనే హీరో తండ్రి శివాజీ రాజా ఉంటాడు. అక్కడ హీరోయిన్ హీరోను కొడుతుంటే.. ‘‘మీ కొడుకేనా.. అలా కొట్టేస్తోంది’’ అని అడుగుతాడు. తర్వాత తలకు డై వేసుకుని పాత చొక్కాలో ఉన్న శివాజీరాజాను చూసి.. ‘‘నైట్ డ్రెస్ బాగుంది’’ అనడంలో సినిమా ముగుస్తుంది. ఈ పంచులు సినిమాలో బాగానే పేలాయి. ఓవైపు తాను హీరోగా నటించిన సినిమా థియేటర్లలో ఉండగానే.. రోహిత్ తన సినిమాకు పోటీగా రిలీజైన సినిమాలో ఇలా క్యామియో రోల్ లో కనిపించడం ఆశ్చర్యం కలిగించే విషయమే.