స్టార్ హీరోల సినిమాలు రిలీజవుతుంటే అభిమానుల హంగామా మామూలుగా ఉండదు. ఈ హంగామా, హడావుడి ఏ స్థాయిలో ఉందన్న దాన్ని బట్టే ఆ హీరోకున్న క్రేజ్ ఏంటన్నది అంచనా వేస్తారు జనాలు. ఐతే తెలుగులో మొట్ట మొదటి మాస్ హీరో ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ ముందు ఇప్పటి హీరోల క్రేజ్ దిగదుడుపే అంటారు అప్పటి ఆయన అభిమానులు. ఎన్టీఆర్ సినిమా వచ్చిందంటే.. ఊళ్లకు ఊళ్లు బండ్లు కట్టుకుని పట్టణాలకు వెళ్లిపోయేవారు. థియేటర్ల ముందు రాత్రి నుంచే పడిగాపులు కాసి టికెట్లు సంపాదించేవాళ్లు. ఇక ఎన్టీఆర్ ప్రభ పతాక స్థాయిని అందుకున్న 70ల్లో పరిస్థితి ఎలా ఉండేదో కథలు కథలుగా చెబుతుంటారు ఆయన అభిమానులు.
ఐతే ఈ కథలేమీ చెప్పకుండా ఒక్క ఫొటో ద్వారా ఎన్టీఆర్ కు అప్పట్లో ఎంతటి క్రేజ్ ఉండేదో చాటి చెప్పాడు నారా రోహిత్. ఎన్టీఆర్ కెరీర్ లోనే అతి పెద్ద హిట్లలో ఒకటైన ‘దాన వీర శూర కర్ణ’ విడుదల సందర్భంగా 1977లో గుంటూరులోని నాజ్ థియేటర్ ముందు నెలకొన్న సందడికి సంబంధించి ఒక ఫొటోను ఫేస్ బుక్ లో షేర్ చేశాడు నారా వారబ్బాయి. థియేటర్ చుట్టూ ఎటు చూసినా జనమే. వందల మంది బారులు తీరి ఉన్న ఆ ఫొటో చూస్తే ఎన్టీఆర్ కు ఆ రోజుల్లో ఎంత క్రేజ్ ఉండేదో అర్థమవుతుంది. ఇక థియేటర్ లోపల ఎంత సందడి ఉండి ఉంటుందో కూడా అంచనా వేయొచ్చు. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘దాన వీర శూర కర్ణ’ తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప సినిమాల్లో ఒకటిగా నిలిచిపోయింది.