మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికలు ఈనెల 10న రసవత్తరంగా సాగిన సంగతి తెలిసిందే. ఈ పోరులో శివాజీ రాజా బృందంపై నెగ్గి సీనియర్ నరేష్ అధ్యక్ష పదవిని చేపట్టబోతున్నారు. అయితే నరేష్ పదవీ బాధ్యతలు స్వీకరించేది ఎప్పుడు? అంటే అందుకు సంబంధించిన ఏర్పాట్లు సాగుతున్నాయని తెలిసింది. ఇప్పటికే కొత్త ప్యానెల్ సభ్యుల వివరాల్ని వెల్లడించారు. `మా` కొత్త కమిటీ బాధ్యతల స్వీకారానికి సంబంధించి ఓ కార్యక్రమాన్ని గ్రాండ్ గా చేయనున్నారని తెలుస్తోంది.
2019-20 సీజన్ కి `మా` అధ్యక్షుడిగా ఎన్నికైన నరేష్ కి ప్రస్తుతం సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్టిస్టుల సంఘం కార్యాలయంలో పలువురు ప్రముఖులు పుష్పగుచ్చాలతో ఆయనను సన్మానిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు నరేష్ ని కలిసి విష్ చేశారు. ప్రస్తుతం పదవీ స్వీకారానికి సంబంధించి ఏం చేయాలి? అన్నదానిపైనా వర్క్ జరుగుతోంది. నరేష్ ఫాలోవర్స్ అయిన ఆర్టిస్టులంతా అందుకు సంబంధించి ఘనంగానే ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
నేడు మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా స్థానంలో `మా` ఆఫీస్ లో కొత్త అధ్యక్షుడు నరేష్ ఆశీనులై కనిపించారు. ప్రధాన కార్యదర్శి జీవిత రాజశేఖర్ సహా ఆర్టిస్టుల బృందం పెద్ద ఎత్తున ఫిలింఛాంబర్ లో కనిపించారు. ఇప్పటికే `మా` మునుముందు చేయాల్సిన పనులపైనా నరేష్ దృష్టి సారిస్తున్నారట. ఇక ఎన్నికల వేళ శివాజీ రాజాతో హోరా హోరీ విమర్శల గురించి ప్రస్థావిస్తూ అవన్నీ ఎన్నికల వరకే పరిమితమని అన్నారు. అన్నీ మర్చిపోయి చేయాల్సిన పనిపై దృష్టి సారిస్తామని వ్యాఖ్యానించారు.