పన్నుతో నానికి పెద్ద ప్రాబ్లమేనా??

Update: 2018-01-30 04:37 GMT
వరస హిట్లతో మాంచి జోరుమీదున్నాడు నాచురల్ స్టార్ నాని. లేటెస్ట్ మూవీ ఎంసీఏ సాధారణమైన కథతోనూ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు దక్కించుకోవడం నానికి ప్రేక్షకుల్లో పెరిగిన ఇమేజ్ కు అద్దం పట్టింది. తరవాత సినిమా కృష్ణార్జున యుద్ధం షూటింగ్ జోరుగా చేస్తుండగా.. రీసెంట్ గా నానికి జరిగిన కారు యాక్సిడెంట్ తో ఆ జోరుకు బ్రేకులు పడ్డాయి.

కొద్దిరోజుల క్రితం జూబ్లీహిల్స్ లో నాని కారు స్పీడుగా వెళ్తూ ఎలక్ట్రిక్ పోల్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే నాని ఆ ప్లేసు నుంచి వెళ్లిపోయాడు. చాలాసేపు ఈ న్యూస్ సీక్రెట్ గానే ఉంచారు. చివరకు దీనిపై ఛానళ్లలో న్యూస్ రావడంతో  తాను క్షేమంగానే ఉన్నానంటూ నాని ఓ ట్వీట్ పెట్టడంతో అంతా హ్యీపీగా ఫీలయ్యారు. ఈ యాక్సిడెంట్ జరిగిన సమయంలో నాని కారులోనే ఉన్నాడని.. కారు స్తంభాన్ని ఢీకొట్టిన వెంటనే ముందు సీటుకు బలంగా తగిలి అతడి పన్ను ఊడిపోయిందని అతడి సన్నిహితులు చెబుతున్నారు. దీంతో డెంటల్ డాక్టర్ ను కలవడంతో దానికి చికిత్స చేయడానికి కాస్తంత టైం పడుతుందని తేల్చిచెప్పాడని తెలుస్తోంది. ఇది సెట్ కావడానికి మరింత సమయం పట్టేలానే ఉందని.. పన్ను పెట్టించాక కూడా దానికి అలవాటు పడటానికి మరికొంత కాలం పడుతుందని అంటున్నారు.

ప్రస్తుతం నాని నటిస్తున్న కృష్ణార్జునయుద్ధం సినిమాలో కెరీర్ లో రెండోసారి డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ఫేం మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో అనుపమ పరమేశ్వర్.. రుక్సార్ మిర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Tags:    

Similar News