నయన్ బ్రేకప్.. అంతా బూటకమేనా?

Update: 2016-06-20 13:08 GMT
సౌతిండియమా మొత్తం దున్నేస్తున్న మలయాళీ సోయగం నయన తార.. సినిమాల్లో ఎంతటి ట్యాలెంట్ చూపిస్తుందో.. రియల్ లైఫ్ లో అదే రేంజ్ లో వివాదాలను ఎఫైర్లను నడిపించేసింది. అయితే.. లవ్ స్టోరీ బ్రేకయిన ప్రతీసారి ఈమె కెరీర్ పైపైకి ఎదగడం విశేషం.

మొదట శింబు.. ఆ తర్వాత ప్రభుదేవా.. రెండు సార్లు లవ్ స్టోరీలు బ్రేక్ అయినా.. కెరీర్ లో నయన్ స్పీడ్ ఏ మాత్రం తగ్గలేదు. రీసెంట్ గా విఘ్నేష్ శివన్ అనే దర్శకుడితో నయన్ చెట్టాపట్టాలేసుకుని తిరిగిన విషయం తెలిసిందే. అయితే.. ఈ స్టోరీకి బ్రేక్ పడిపోయిందని.. బ్రేకప్ చెప్పేసుకున్నారనే కామెంట్స్ వినిపించాయి. కానీ ఇప్పుడీ న్యూస్ ని అనుమానించాల్సి వస్తోంది. 63వ ఫిలింఫేర్ అవార్డుల్లో.. నయన్ కు తమిళ్ చిత్రాలకు గాను బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ వచ్చింది.

విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన నానుమ్ రౌడీ దాన్ చిత్రానికే నయన్ కి ఫిలింఫేర్ వచ్చింది. దీంతో తన సంతోషాన్ని దర్శకుడితో పంచుకుంటూ ఇద్దరూ కలిసి ఉన్న ఓ ఫోటో ఒకటి బయటికొచ్చింది. డైరెక్టర్-హీరోయిన్ గా రిలేషన్ బాగానే ఉంది కానీ.. ఆ ఫోటోలో వాళ్ల కెమిస్ట్రీ చూస్తుంటే.. బ్రేకప్ అయిపోయిన జంట అని మాత్రం అనిపించదు. చూస్తుంటే.. వీళ్ల ప్రేమ మళ్లీ మొదలవడం అయినా జరిగి ఉండాలి. లేదా అసలు బ్రేకప్ అనే కథే బూటకం అయుండాలి. అంతే.
Tags:    

Similar News