బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో అనూహ్యంగా వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారం పై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసుని విచారిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) ఇప్పటి వరకు 90కి పైగా కేసులు నమోదు చేసి, 275 మందిని అరెస్టు ఎంక్వైరీ చేసినట్లు టాక్. ఈ కేసులో పలువురు సినీ ప్రముఖులను కూడా ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆదివారం బాలీవుడ్ నటుడు అర్మాన్ కోహ్లీని ఎన్‌సీబీ ముంబైలో అరెస్టు చేసింది.
అర్మాన్ కోహ్లీ నివాసంలో శనివారం సోదాలు నిర్వహించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు.. కొద్ది మొత్తంలో కొకైన్ దొరికినట్లు తెలిపారు. దక్షిణ అమెరికా దేశాల నుంచి ఈ మాదకద్రవ్యాలు దిగుమతి అయినట్లు గుర్తించారు. దీంతో డ్రగ్స్ ను ముంబై కి ఎవరి ద్వారా చేరిందనే దానిపై ఎన్‌సీబీ విచారణ జరుపుతోంది. ఈ కేసుతో అంతర్జాతీయ సంబంధాలు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.
కాగా, ఎన్‌సీబీ అధికారులు డ్రగ్స్ సప్లయిర్స్ అజయ్ రాజ్ సింగ్ ను శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఎంక్వైరీలో అతడు ఇచ్చిన సమాచారంతోనే అర్మాన్ కోహ్లీ ఇంటిపై ఎన్సీబీ దాడి చేసినట్లు తెలుస్తోంది. అక్కడ కొకైన్ లభించడంలో అర్మాన్ కోహ్లీని ముంబైలోని ఎన్‌సీబీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. అర్మాన్ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' చిత్రంలో నటించాడు. అలానే సల్మాన్ హోస్ట్ గా చేసిన 'బిగ్ బాస్' రియాలిటీ షో లోనూ కోహ్లీ కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు.