సమంత ఫ్రెండ్ కి బాబు పుట్టాడు..

Update: 2015-12-06 12:54 GMT
ఫిలిం ఇండస్ట్రీలో పర్సనల్ రిలేషన్ వరకూ వెళ్లే ఫ్రెండ్ షిప్ లు తక్కువగానే ఉంటాయి. హీరోయిన్స్ కయితే ఈ పరిమితులు ఇంకా ఎక్కువగా ఉంటాయి. దక్షిణాదిన చక్రం తిప్పుతున్న బ్యూటీ సమంతకు.. టాలీవుడ్ లో నీరజ కోనతో అంతటి రిలేషన్ ఉంది. ఈమె కాస్ట్యూమ్ డిజైనర్ కాగా... సమంతకు బెస్ట్ ఫ్రెండ్ గా చెప్పుకుంటారు. ఈమె రైటర్ కోన వెంకట్ కజిన్ కావడం గమనించాలి.

2014 జూన్ 17న నీరజ వివాహం చేసుకుంది. కొన్ని నెలల క్రితం తాను ప్రెగ్నెంట్ అంటూ ట్వీట్ చేసిన ఈమె.. తర్వాత ఇప్పుడు తనకు బాబు పుట్టాడంటూ ట్వీట్ చేసింది. "అన్ష్" అని పేరు పెట్టినట్లు ఫోటోతో సహా ట్వీట్ చేసింది నీరజ. "నాకో కొత్త  బంధం, నా కొడుకు అన్ష్.. నేనిప్పుడు అమ్మనయ్యా" అంటూ చిన్నారి ఫోటోతో సహా ట్వీట్ చేసింది నీరజ. తల్లీ బిడ్డా క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నారని సన్నిహితులు చెబ్తున్నారు. ప్రస్తుతం నీరజ తన మదర్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తోంది. చిన్నారితోనే ఎక్కువకాలం గడుపుతోంది.
Tags:    

Similar News