బ‌న్నీతో పిజ్జానే కాదు స‌మోసా కూడా తినే ఛాన్స్!

Update: 2022-11-13 00:30 GMT
'బ‌న్నీ గారు మీరిలా రౌండ్ రౌండ్ గా తిరుగుతుంటే పిజ్జా తినాల‌నిపిస్తుంది అంటోంది ఎంతో రొమాంటిక్ గా నేహాశెట్టి.. పిజ్జా  అయినా పెస‌ర‌ట్టు అయినా అది ఉందిగా అంటూ బ‌న్నీ సైతం అంతే రొమాంటిక్ ఓ లుక్ ఇస్తాడు.' ఇది ఓ ప్ర‌మోష‌న్ యాడ్ అయినా ఇద్ద‌రి మ‌ధ్య‌ ఆన్ స్ర్కీన్ కెమిస్ర్టీ సూప‌ర్బ్ అనిపిస్తుంది. ఇది కేవ‌లం కొన్ని సెకెన్ల యాడ్ మాత్ర‌మే.

అయితే  ఇప్పుడా హీరోయిన్ కి పిజ్జానే కాదు..ఏకంగా మ‌సాలా స‌మోసా తినే ఛాన్స్ ద‌క్కిన‌ట్లు గుస గుస వినిపిస్తుంది. వివ‌రాల్లోకి వెళ్తే..ప్ర‌స్తుతం  అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా చిత్రం పుష్ప‌-2 తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య రూపొందుతున్న చిత్ర మిది.   భారీ తారాగ‌ణంతో లెక్క‌లు మాష్టారు అంచ‌నాలు మించి తెర‌కెక్కిస్తున్నారు.

అంత‌ర్జాతీయ ప్రాజెక్ట్ గా మ‌లుస్తున్నారు. దీనిలో భాగంగా  అత్యున్న‌త సాంకేతి ప‌రిజ్ఞానాన్ని వినియోగిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇక మొదటి భాగం త‌ర‌హాలోనే రెండ‌వ భాగంలోనూ ఎంట‌ర్ టైన్ మెంట్ కి ..మ‌సాలా స‌న్నివేశాల‌కు కొద‌వేం ఉండ‌ద‌ని తెలుస్తుంది. మొద‌టి  భాగంలో  బ‌న్నీకి జోడీగా న‌టించిన ర‌ష్మిక మంద‌న్న యాధ‌విధిగా రెండ‌వ భాగంలోనూ  రొమాంటిక్ స‌న్నివేశాల్లో చెల‌రేగ‌నుంది.

ఇంకా  ర‌ష్మిక‌ ప్రెండ్స్ గ్యాంగ్ స‌న్నివేశాలు అదే తీరున హైలైట్ కానున్నాయి. ఆ మాస్ మ‌సాలా స‌న్నివేశాలు సినిమాకి  ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. ఈ నేప‌థ్యంలో రెండ‌వ భాగంలోనూ ఆ త‌ర‌హా స‌న్నివేశాలు హైలైట్ కానున్నా్యి. దీనిలో  భాగంగా కొన్ని కొత్త పాత్ర‌ల్ని సైతం  తెర‌పైకి తీసుకొస్తున్నారు. ఈసారి మాత్రం పేరున్న న‌టుల్ని రంగంలోకి దించుతున్న‌ట్లు స‌మాచారం.

దీనిలో భాగంగా యువ న‌టి నేహా శెట్టికి కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ట్లు ఉప్పందింది. ర‌ష్మిక‌కి పోటీగా  అద‌నంగా మ‌రో రెండు ఫీమేల్ పాత్ర‌లు డిజైన్ చేసారుట‌. అందులో ఓ పాత్ర కి నేహా శెట్టిని ఎంపిక చేసిన‌ట్లు లీకులందుతున్నాయి. బ‌న్నీ-నేహా మ‌ద్య కొన్ని రొమాంటిక్ స‌న్నివేశాలు సైతం ఉన్నాయ‌ట‌.

అవి  బుల్లి తెర‌పై క‌నిపించే వెజ్ త‌రహా స‌న్నివేశాలు  కాద‌ని....ఉల్లిపాయ మ‌సాలా ద‌ట్టించిన స‌మోసా లాంటి ఘాటు స‌న్నివేశాలు రాసిన‌ట్లు గుస గుస వినిపిస్తుంది. రొమాంటిక్ స‌న్నివేశాలు డిజైన్ చేస్తే అందులో సుకుమార్ స్పెషాల్టీ త‌ప్ప‌నిస‌రి. అందులోనూ ఇలాంటి మాస్ సినిమాలో అయితే వాటి ఫ‌రిది గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. సుకుమార్ రియాల్టీ చూపించేయ‌రు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News