ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు కరోనా సమయంలోనే చాలా కూల్ గా రెండవ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక తర్వాత ఆయన తన రెండవ భార్య వైఘ రెడ్డితో సరికొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. ఒకవైపు సినిమాలను చూసుకుంటూనే మరొకవైపు ఫ్యామిలీ లైఫ్ కోసం కూడా ప్రత్యేకంగా టైమ్ కేటాయిస్తూ తన ఫిట్నెస్ విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. ఆ విషయంలో ఆయన భార్య వైగారెడ్డి ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించినట్లుగా తెలుస్తోంది.
అయితే ఇటీవల ఈ దంపతులు ఒక పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దిల్ రాజు బాక్సాఫీస్ సక్సెస్ వచ్చినంత ఆనందంగా తన కొడుకుతో హ్యాపీ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తున్నారు.
అయితే రీసెంట్ గా దిల్ రాజు తన వారసుడికి ప్రత్యేకంగా నామకరణం కూడా చేసినట్లుగా తెలుస్తోంది. దిల్ రాజు మొదటి భార్య కూతురు హర్షిత రెడ్డి ఆలోచన మేరకు దిల్ రాజు తన కొడుకుకు ప్రత్యేకంగా పేరు పెట్టినట్లుగా తెలుస్తోంది.
దిల్ రాజు కొడుకు పేరు 'అన్వి రెడ్డి' అనే పెట్టారట. అంటే అందులోనే దిల్ రాజు తన మొదటి భార్య అక్షరం కూడా వచ్చేలా ఆలోచించడం విశేషం. రాజు మొదటి భార్య అనిత రెండేళ్ల క్రితం మృతి చెందింది.
ఇక తన మొదటి భార్య అనిత పేరు నుండి మొదటి అక్షరాన్ని తీసుకొని, దానిని తన రెండవ భార్య వైఘ అనే రెండు అక్షరాలతో కలుపుతూ.. దిల్ రాజు తన బిడ్డకు ఈ పేరు పెట్టాడు.
సంస్కృతంలో ఈ పేరుకు అర్థం కూడా ఉంది.
52 ఏళ్ల దిల్ రాజు మరియు 29 ఏళ్ల వైఘారెడ్డి మొదటి లాక్‌డౌన్ సమయంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక దిల్ రాజు నిర్మించిన థాంక్యూ అనే సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నాగచైతన్య హీరోగా నటించిన ఈ సినిమాను విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉంటూనే దిల్ రాజు కొడుకు నామకరణం వేడుకల్లో కూడా పాల్గొన్నారు.