మరోసారి నాంది కాంబినేషన్!

Update: 2022-05-29 23:30 GMT
కామెడీ చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న అల్లరి నరేష్ కెరీర్ మొదట్లో మాత్రం చాలా బిజీగా కనిపించేవాడు. అతని నుంచి ఎలాంటి సినిమా వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకునేవి. అల్లరి నరేష్ సినిమా అంటే నిర్మాతలకు పెట్టిన పెట్టుబడిలో ఎంతోకొంత లాభం అయితే వచ్చేవి. కానీ మారుతున్న కాలానికి తగ్గట్టుగా అల్లరి నరేష్ రెగ్యులర్ కామెడీ సినిమాలను జనాలు పూర్తిగా పక్కన పెట్టేశారు.

వరుసగా నరేష్ కు 10 సినిమాలకు పైగా అపజయాలు ఎదురవడంతో కాస్త నిరుత్సాహపడ్డాడు. అయితే ఎలాగైనా మళ్లీ ప్రేక్షకులకు దగ్గర అవ్వాలని అల్లరి నరేష్ సరికొత్త ప్రయోగం తో సక్సెస్ అయ్యాడు.

2021లో కరోనా కష్టకాలంలోనే కొనసాగుతున్న సమయంలోనే ఆ సినిమాను విడుదల చేశారు. న్యాయవ్యవస్థ లోపాలను ఎత్తి చూపుతూ తెరపైకి వచ్చిన సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

హరీష్ శంకర్ సినిమాలకు పనిచేసిన సహాయ దర్శకుడు విజయ్ కనకమెడల ఆ సినిమాను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను హిందీలో కూడా రీమేక్ చేయాలని దిల్ రాజు ప్రయత్నాలు చేశాడు. కాని ఆ ప్రణాళికలు అంతగా సక్సెస్ కాలేదు.

నాగచైతన్య కూడా హీరోగా చేయాలని అనుకున్నాడు కానీ స్క్రిప్ట్ పై నమ్మకంగా అనిపించక పోవడం తో మళ్లీ ఉఎందుకో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. అయితే మరోసారి విజయ్ కనకమేడల అల్లరి నరేష్ తో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

నాంది సినిమా సక్సెస్ అయినప్పుడు అల్లరి నరేష్ మొదట దర్శకుడికి చాలా క్లోజ్ అయిపోయాడు. అతనితో తదుపరి సినిమాకు కూడా నేనే చేయబోతున్నాను అని అప్పట్లో ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు.

అయితే విజయ్ కనకమేడల మాత్రం ఒక పెద్ద సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్రయత్నాలు చేశాడు కానీ వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు మరో సారి అతను తిరిగి రావడంతో నరేష్ కూడా ఆ దర్శకుడుతో వర్క్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మరి రెండవసారి ఈ కాంబినేషన్ లో ఎలాంటి సినిమా వస్తుందో చూడాలి.
Tags:    

Similar News