బాలీవుడ్ లో ఖాన్ ల త్రయానికి ఉన్న గుర్తింపు స్టామినా ఎప్పుడూ చర్చల్లో అంశం. అందులోను మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కి ఉన్న రేంజు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. దశాబ్ధాల పాటు అగ్ర కథానాయకుడిగా నిర్మాతగా అమీర్ ఖాన్ తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అయితే ఈ సామ్రాజ్యంలో అతడి కుటుంబం నుంచి వారసుడు ఎవరున్నారు? అంటే ఇప్పుడు చెప్పుకోవడానికి ఎవరూ కనిపించనే లేదు. అమీర్ మొదటి భార్య కుమారుడు జునైద్ నటనలో కొనసాగుతున్నా కానీ తండ్రి స్థాయిని అందిపుచ్చుకోలేని ధైన్యం కనిపిస్తోంది. అతడు దర్శకత్వంపైనా మొగ్గు చూపుతున్నాడు.
మరోవైపు మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ ని పెద్ద స్టార్ ని చేయాలని కంకణం కట్టుకున్న అమీర్ ఖాన్ తాను ఆశించినది చేయడంలో విఫలమయ్యారు. ఇమ్రాన్ హీరో అయితే అయ్యాడు కానీ అతడు కెరీర్ పరంగా రాణించలేదు. వరుస ఫ్లాపులతో అతడికి ఐడెంటిటీ కూడా మిస్ అయ్యింది. ఇంతలోనే అతడు భార్య నుంచి బ్రేకప్ వార్తలతో చర్చల్లో నిలిచాడు. తన చిన్ననాటి గాళ్ ఫ్రెండ్ అవంతికను పెళ్లాడిన ఇమ్రాన్ తనకు ఒక కుమార్తె పుట్టిన తర్వాత విడిపోయే పరిస్థితి రావడం అతడు జీర్ణించుకోలేకపోతున్నాడని ముంబై మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇమ్రాన్ రెండేళ్లుగా తన భార్య అవంతిక మాలిక్ కి దూరంగానే ఉంటున్నాడు. ఎనిమిదేళ్ల పాటు ప్రేమించుకుని పెళ్లాడిన జంట విడివిడిగా ఉండడంపై బాలీవుడ్ లో పెద్ద డిబేట్ నడిచింది. వ్యక్తిగత జీవితంలో చికాకులన్నీ ఇమ్రాన్ కెరీర్ పైనా తీవ్రంగానే ప్రభావం చూపించాయని అది అమీర్ ని ఎంతో కలతకు గురి చేసిందని బాలీవుడ్ మీడియా కోడై కూసింది.
యువ జంట కలతలపై సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికారు చేశాయి. తొందర్లోనే ఈ జంట విడాకులు తీసుకోవడం గ్యారెంటీ! అని ముంబై మీడియా ప్రచారం చేసింది. ఈ ప్రచారం అమీర్- ఇమ్రాన్ అభిమానులందరికీ షాక్ నిచ్చింది. 2019 జూన్ నుండి విడివిడిగా నివసిస్తున్న ఈ జంట ఇవన్నీ పుకార్లు అని కానీ .. నిజాలు అని కానీ అస్సలు ధృవీకరించలేదు. తమపై సాగిన ప్రచారాన్ని ఖండించనూలేదు.
అవంతిక కానీ.. ఇమ్రాన్ కానీ తమపై వచ్చిన రూమర్లపై ఇప్పటివరకు స్పందించనేలేదు. అవంతిక తల్లి వందన మాలిక్ ఇంతకుముందు ఒక వెబ్ సైట్ తో మాట్లాడుతున్నప్పుడు కుమార్తె విడాకులపై వస్తున్న పుకార్లను కొట్టిపారేశారు. ఎనిమిది సంవత్సరాలుగా డేటింగ్ చేసిన ఇమ్రాన్ ఖాన్ - అవంతిక మాలిక్ 2011లో వివాహం చేసుకున్నారు. వారి మొదటి సంతానం కుమార్తె ఇమారా 2014 లో జన్మించింది. ఇమ్రాన్ ఖాన్ కెరీర్ మ్యాటర్స్ చూస్తే.. జానే తు ... యా జానే నా- కిడ్నాప్- ఐ హేట్ లవ్ స్టోరీస్- దిల్లీ బెల్లీ- గోరి తేరే ప్యార్ మే చిత్రాల్లో నటించాడు. చివరిసారిగా 2015 `కట్టి బట్టి`లో నటించాడు. అయితే వ్యక్తిగత జీవితంలో డిస్ట్రబెన్సెస్ అతడి కెరీర్ ని ప్రభావితం చేశాయని టాక్ కొనసాగుతోంది.
వ్యక్తిగత జీవిత కల్లోలంతో సినీ ప్రపంచానికి దూరమైన ఖాన్ మేనల్లుడు ఇన్నాళ్టికి అకేషనల్ గా ఓ ఈవెంట్లో ప్రత్యక్షమయ్యాడు. ఇమ్రాన్ ఖాన్ చాలా కాలంగా లైమ్ లైట్ లో లేకపోవడంతో కెమెరాల ముందు పోజులివ్వలేదు. కానీ ఈరోజు అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్ నిశ్చితార్థంలో అతడు ప్రత్యక్షమయ్యాడు. కెమెరాలకు ఫోజులిచ్చాడు. ఇమ్రాన్ వైట్ షర్ట్ నీలిరంగు బ్లేజర్.. ఎరుపు టైడ్ లేత గోధుమరంగు ప్యాంటుతో కనిపించాడు.
అతను వేదికలోకి ప్రవేశించే ముందు థంబ్స్ అప్ గుర్తును కూడా ఫ్లాష్ చేశాడు. కానీ మునుపటిలా అతడిలో జోష్ కనిపించలేదు. ఇక సినిమాల్లో కనిపించని నటుడు ఇమ్రాన్ ఖాన్ కూడా ఈ ఈవెంట్ లో చాలా అరుదుగా కనిపించాడు. మునుముందు అతడు హీరోగా కంబ్యాక్ అవుతాడా లేదా? అన్నదానికి కూడా ఇప్పటికి సరైన సమాచారం లేదు. ఏది ఏమైనా బాలీవుడ్ అనే యూనివర్శిటీని డీన్ లా ఏలిన అమీర్ ఖాన్ తన వారసత్వాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాడని అభిమానులు తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. అమీర్ లాంటి గొప్ప నటుడి లెగసీని నడిపించే సరైన వారసుడు లేకపోవడం ఎప్పుడూ చర్చనీయాంశమే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.