సోషల్ మీడియాల్లో మాయాజాలం సృష్టించడంలో జాన్వీ కపూర్ ఇతర నాయికల కంటే చాలా స్పీడ్ మీద ఉంది. 6 నుంచి 60 వరకూ జాన్వీని అభిమానించే ఫాలోవర్స్ కి కొదవేమీ లేదు. తనకు ఉన్న ఫాలోయింగ్ ని బట్టి ప్రకటనలతో ఆదాయ ఆర్జన కూడా అదే రేంజులో ఉంది. ఇటీవల నిరంతరం వేడెక్కించే ఫోటోషూట్లతో అగ్గి రాజేస్తోంది. బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా తనని తాను ఆవిష్కరించుకునేందుకు జాన్వీ ఏ ఒక్క అవకాశాన్ని కూడా జారవిడచడం లేదు. ఇన్నాళ్లు కేవలం బాలీవుడ్ కే పరిమితమైన ఈ బ్యూటీ సాధ్యమైనంత తొందర్లోనే సౌత్ కి కూడా పరిచయం కానుంది. తెలుగు-తమిళంలో క్రేజీ ఆఫర్ల కోసం వేచి చూస్తోంది.
2018లో శశాంక్ ఖైతాన్ రొమాంటిక్ డ్రామా చిత్రం ధడక్ తో ఇషాన్ ఖట్టర్ సరసన డెబ్యూ నటిగా బరిలో దిగింది. ఈ చిత్రం వాణిజ్యపరంగా విజయవంతమైంది. అప్పటి నుండి కెరీర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకున్నదే లేదు. మామ్ శ్రీదేవి ఆశల్ని నెరవేరుస్తూ అగ్ర పథంలోకి దూసుకెళుతోంది. యువనాయిక వరుస చిత్రాల్లో నటిస్తూ క్షణం తీరిక లేనంత బిజీగా ఉంది. ఘోస్ట్ స్టోరీస్- గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్ -రూహి వంటి చిత్రాలలో నటనకు గొప్ప పేరు తెచ్చుకుంది.
వర్తమానంలో నితేష్ తివారీ దర్శకత్వంలో వరుణ్ ధావన్ సరసన `బవాల్` చిత్రీకరణలో బిజీగా ఉంది. జాన్వీ ప్రస్తుతం పోలాండ్ లో ఉంది. కొన్ని గంటల క్రితం తన ఇన్ స్టాగ్రామ్ లో తన తదుపరి కామెడీ-క్రైమ్ చిత్రం `గుడ్ లక్ జెర్రీ`ని ప్రమోట్ చేస్తూ కొత్త వీడియోని విడుదల చేసింది.
ఈ వీడియోలో తనపై తానే జోకులు వేసుకుని ఆశ్చర్యపరిచింది. ఈ రోజు తన మేకప్ ఎలా వేసుకుందో అభిమానులకు ప్రదర్శించింది. కపూర్ జావ్ లైన్ (దవడ ఎముకలు సాగినవి చూపిస్తూ) ను ఎలా తాను వారసత్వంగా పొందుతుందనే దానిపై ట్యుటోరియల్ లో వెల్లడించింది. ఈ వీడియోలో తన దవడలు ఎలా లాక్కుపోయాయో ఎలా సాగిపోయాయో కూడా చూపించింది. ``నేను నిన్న చాలా ఐస్ క్రీమ్ లు తిన్నాను. కాబట్టి నా డబుల్ గడ్డాన్ని ఈ విధంగా కట్ చేసాను. ఇప్పుడు నాకు అనిల్ కపూర్ (బాబాయ్).. నా చచ్చు (డాడ్) తరహాలో దవడ షార్ప్ గా ఉంది. ఇంకా చెప్పాలంటే కపూర్ దవడలాగా ఉంది...! అంటూ తనపై తానే జోకులు వేసుకుంది.
గుడ్ లక్ జెర్రీ చిత్రానికి సిద్ధార్థ్ సేన్ గుప్తా దర్శకత్వం వహించారు. కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఆనంద్ ఎల్ రాయ్ నిర్మించారు. ఇందులో దీపక్ డోబ్రియాల్- మితా వశిష్ట్- నీరజ్ సూద్ - సుశాంత్ సింగ్ కూడా నటించారు. ఇది బ్లాక్ కామెడీ .. 2018 తమిళ చిత్రం కొలమావు కోకిలకి రీమేక్. ఈ చిత్రం డిస్నీ+ హాట్ స్టార్ లో 29 జూలై 2022న ప్రీమియర్ ని ప్రదర్శించడానికి షెడ్యూల్ చేసారు. రాజ్‌కుమార్ రావుతో పాటు మిస్టర్ అండ్ మిసెస్ మహి సెట్స్ పై ఉంది. తదుపరి జాన్వి తన తండ్రి బోనీ కపూర్ ప్రొడక్షన్ మిలీ లో నటిస్తోంది. మలయాళ బ్లాక్ బస్టర్ హెలెన్ రీమేక్ లోనూ జాన్వీ నటిస్తోంది. ఇందులో సన్నీ కౌశల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
జిమ్ మిస్సవుతోందిగా..!
గ్లామర్ తో పాటు నటనకు ప్రధాన్యత వున్న పాత్రలలో నటించడానికే ప్రధాన్యతనిస్తున్న జాన్వీ తన ఫిట్ నెస్ ని కాపాడుకోవడం కోసం నిత్యం జిమ్‌కు వెళుతూ తరచూ మీడియా కంట పడేది. కానీ ఇటీవలి కాలంలో అందుకు సమయం చిక్కడం లేదు. ఇటీవల తన చెల్లెలు ఖుషీ కపూర్ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి ఓ పబ్ లో ఎంజాయ్ చేసిన జాన్వీకి ఇప్పుడు తన సోదరి గురించి పట్టించుకునే టైమ్ లేదట. చూస్తుండగానే తన సన్నివేశం ఇలా మారిపోయింది. మునుముందు సౌత్ లో అడుగుపెడితే ఇంకా ఎంత బిజీ అయిపోతుందో? జిమ్ సరిగా చేస్తే దవడ ఎముక సెట్టవుతుందేమో! అంటూ తాజా ఫోటోగ్రాఫ్ పై అభిమానులు పంచ్ లు వేస్తున్నారు.. జస్ట్ ఫ్రెండ్లీగా!!