అన్నీ బాగున్నప్పుడు సినిమాలు కలెక్షన్స్ కురిపించుకోవడం పెద్ద విషయం కాదు. కాకపోతే మూవీ హిట్టవుతుంది కాబట్టి మా సినిమా హిట్.. హిట్ అంటూ ప్రచారం చేసుకొంటారు నిర్మాతలు. కోట్లు పెట్టారు కాబట్టి అలా చేసుకోవడంలో తప్పు లేదు కూడా. కానీ పరిస్థితులు అస్సలు అనుకూలంగా లేని సమయంలో చిత్రాన్ని విడుదల చేయడమే గొప్ప అంటే ఆ మూవీకి కళ్లు చెదిరే కలెక్షన్స్ రావడం నిజంగా మిరాకిల్. అలాంటి అద్భుతాన్నే సాధించాడు హీరో నిఖిల్.
ఎక్కడికి పోతావు చిన్నవాడా అంటూ రాంగ్ టైమ్ లో ఎక్స్ లెంట్ మూవీతో వచ్చాడు. భయపడ్తూనే సినిమా రిలీజ్ చేశారు. నా మూవీ బాగుంటుంది మిమ్మల్ని అస్సలు డిజ్పాయింట్ చేయదంటూ నిఖిల్ కూడా కాస్త ఎమోషనల్ గానే ప్రమోట్ చేశాడు. ఐవీ ఆనంద్ తీసిని సినిమాలో కంటెంట్ అదిరిపోవడం.. మౌత్ టాక్ అడ్వాంటేజ్ తో చిన్నవాడు ఎక్కడికి పోకుండా ఇంకా థియేటర్స్ లోనే అలాగే ఉన్నాడు. కలెక్షన్స్ కుమ్మేస్తున్నాడు.
నెల రోజుల్లో 38 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టింది ఎక్కడికి పోతావు చిన్నవాడా. నిఖిల్ కెరీర్లో ఇదే అతి పెద్ద విజయం. ముందు స్వామిరారా.. దాని తర్వాత కార్తీకేయ నిఖిల్ కి మంచి విజయాలిచ్చాయ్. చిన్నవాడా అయితే ఓవర్ సీస్ లో కూడా స్ట్రాంగ్ మార్కెట్ క్రియేట్ చేసింది. మొత్తానికి ధైర్యం చేసినందుకు ఎక్కడికి పోతావు చిన్నవాడా యూనిట్ మర్చిపోలేని విజయాన్ని సాధించిందనే చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/