ఇంత సైలెంట్ గా ఉంటే ఎలా సూర్య ?

Update: 2019-05-13 08:41 GMT
గజినీతో తెలుగులో కూడా స్టార్ డం తెచ్చేసుకున్న హీరో సూర్యకు గతకొంత కాలంగా మార్కెట్ డల్ గా ఉంది. వరుస పరాజయాలు పలకరించడంతో పాటు రీమేకులు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. అందుకే ఇప్పుడు తన ఆశలన్నీ సెల్వ రాఘవన్ రూపొందించిన ఎన్జికె(నంద గోపాల కుమార)మీదే ఉన్నాయి. ఇది ఈ నెల 31న విడుదల కాబోతోంది. కేవలం రెండు వారాల టైం మాత్రమే ఉంది. ఇక్కడ బజ్ అంతగా లేదు.

ట్రైలర్ కు స్పందన బాగున్నప్పటికీ అదే స్థాయిలో సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులు ఎందరున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కారణం రిలీజ్ దగ్గర పడుతున్నా యూనిట్ వైపు నుంచి ఎలాంటి యాక్టివ్ ప్రమోషన్స్ కనిపించడం లేదు. చివరి రెండు మూడు రోజులు హడావిడి చేసి ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం తప్ప ఈ మధ్య కోలీవుడ్ నిర్మాతలు అంత చురుగ్గా పబ్లిసిటీ చేయడం లేదు

సాయి పల్లవి రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా మొదటిసారి కలిసి నటిస్తున్నారు. గ్లామర్ పరంగా ఏ లోటు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కాబట్టి సహజంగానే ఇలాంటి సబ్జెక్ట్స్ లో రిస్క్ ఎక్కువగా ఉంది. సూర్య లాంటి స్టార్ హీరో అయితే మార్కెటింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుని హైప్ సృష్టించుకోవచ్చు.

కానీ ఎన్జికె టీమ్ తాపీగా ఉంది. ఇంతకీ 31 వస్తుందా లేక మళ్ళి వాయిదా ఆలోచన ఉందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. కొంచెం స్పీడ్ పెంచితే తప్ప ఎన్జిజె పబ్లిక్ లోకి బలంగా వెళ్లడం కష్టం. ఓ సామాన్యుడు రాజకీయాల్లోకి వెళ్లి తిరుగులేని నాయకుడిగా ఎలా ఎదిగాడు అనే పాయింట్ మీద రూపొందిన ఈ మూవీని భారీ ఎత్తున విడుదలకు ప్లాన్ చేశారు
Tags:    

Similar News