ఎన్నడూ లేనిది 2019 సంక్రాంతి మహా రంజుగా ఉండబోతోంది. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో రసవత్తరమైన పోటీ నెలకొంది. కాకపోతే అన్ని స్టార్ హీరోల సినిమాలే కావడంతో మార్కెట్ పరంగా పెద్ద చిక్కొచ్చి పడేలా ఉంది. ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలూ ఇప్పటికే డేట్స్ ప్రకటించేసారు. కథానాయకుడు జనవరి 9న థియేటర్లలో అడుగు పెడుతుంది. దీంతో పాటు బోయపాటి శీను-రామ్ చరణ్ కాంబో మూవీ కూడా బరిలో దూకుతుంది. పోటీ సంగతి ఎలా ఉన్నా క్రేజ్ దృష్ట్యా ఇప్పటికే వీటికి భారీ ఎత్తున వ్యాపార లావాదేవీలు పూర్తయ్యాయి.
మరోవైపు దిల్ రాజు వెంకటేష్ వరుణ్ తేజ్ లతో నిర్మిస్తున్న మల్టీ స్టారర్ ఎఫ్2 కూడా ఇదే రేస్ లో ఉంది. వ్యక్తిగతంగా డిస్ట్రిబ్యూటర్ కావడం వల్ల ఆ రెండు సినిమాల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉన్నా తన వరకు డీసెంట్ నెంబర్స్ వచ్చేలా థియేటర్లను మేనేజ్ చేసుకోగలడు. అయినప్పటికీ తక్కువ థియేటర్లు ఉన్న చిన్న పట్టణాలు బిసి సెంటర్స్ లో ఇబ్బందులు తప్పవు.
ఇదిలా ఉంచితే తమిళ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ పెట్టా అజిత్ విశ్వాసం కూడా పొంగల్ రేస్ లో ఉన్నాయి. రజనికి ఇక్కడ బలమైన మార్కెట్ ఎలాగూ ఉంది. అజిత్ కు తెలుగులో అంత లేదు కాని సినిమా బాగుంటే రాబట్టే కెపాసిటీ ఉన్న వాడే. కానీ వీటి డబ్బింగ్ వెర్షన్లు సంక్రాంతి టైంలోనే రిలీజ్ చేయడం దుర్లభంగా కనిపిస్తోంది. కారణం టాలీవుడ్ లో వస్తున్న మూడూ భారీ సినిమాలే కావడం. గత ఏడాది సూర్య గ్యాంగ్ కు ఇదే సమస్య వచ్చినప్పుడు యువి సంస్థతో పాటు గీతా సహకారంతో విడుదల చేసుకుని ఎంతో కొంత రాబట్టుకున్నాడు. కానీ ఈసారి రజని అజిత్ లకు ఆ ఛాన్స్ లేదని ట్రేడ్ సమాచారం.
థియేటర్ల కొరతతో పాటు ఆయా సినిమాల నిర్మాతలు చెప్పే రేట్లకు వర్క్ అవుట్ చేసుకోవడం కష్టం కాబట్టి ఈ మూడు చాలని అంటున్నారట. ఇదే పెట్టా విశ్వాసం నిర్మాతలకు శరాఘాతంగా మారొచ్చు. పోనీ రజని ఒక్కడిదే విడుదల చేద్దామన్నా చరణ్ బాలయ్య వెంకీ అంత ఈజీగా దారిచ్చేలా లేరు.సో వాయిదా తప్పదనే వినికిడి.దీని గురించిన క్లారిటీ మరికొద్ది రోజుల్లోనే వచ్చే అవకాశం ఉంది