టాలీవుడ్ లో నటవారసుల వెల్లువ సాగుతూనే ఉంది. ఇటీవలే అక్కినేని నాగార్జున నటవారసుడు అఖిల్ తెరంగేట్రం చేశాడు. అప్పుడే రెండు సినిమాల్లో నటించేశాడు. అఖిల్ తొలి సినిమా సమయంలోనే నటసింహా నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ప్రచారమైంది. అయితే అప్పటి నుంచి అదంతా కేవలం అనధికారిక ప్రచారంగానే మిగిలిపోయింది. మోక్షు సినీ ఎంట్రీ ఇప్పటికీ అధికారికం కానేకాదు.
గత కొంతకాలంగా నటసింహా నందమూరి బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞ సినీఎంట్రీ గురించి వేడెక్కించే ప్రచారం సాగుతోంది. 2017లోనే మోక్షు బరిలో దిగిపోతున్నాడంటూ ప్రచారం సాగినా కుదరలేదు. క్రిష్ దర్శకత్వం వహించిన గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తాడని ప్రచారమైంది. అప్పుడు ఛాన్స్ మిస్సయ్యింది. ఆ క్రమంలోనే మోక్షు నటశిక్షణను మరింత ఫాలిష్ పెడుతున్నారని - ఫైట్స్ లో తర్ఫీదు పొందుతున్నాడని చెప్పారు.
అన్ని ఛాన్సులు మిస్సయినా ఇప్పుడు మాత్రం ఇక మిస్ కాదని ఇటీవల మరో ప్రచారం. ఈసారి విశ్వవిఖ్యాత నవరసనటసార్వభౌమ ఎన్టీఆర్ జీవితంపై తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ లో మోక్షజ్ఞ నటిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. దీనిపై చిత్రయూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మరోవైపు బాలయ్య అభిమానులంతా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ గురువారం మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా తన డెబ్యూ సినిమా ప్రకటన ఉంటుందని ఎదురు చూసిన అభిమానులకు ఎలాంటి కన్ఫర్మేషన్ లేకపోవడంతో నిరాశ ఎదురైంది. మోక్షు ఎంట్రీ ఊహాగానాలేనా? అసలు ఎన్టీఆర్ చిత్రంలో నటిస్తున్నాడా లేదా? నూనూగు మీసాల నిమ్మకూరు రామారావు అవుతాడా లేదా? అంటూ ఫిలింనగర్‌లో చర్చ సాగుతోంది. మోక్షజ్ఞ సినిమాలో నటిస్తున్న బొమ్మ పడ్డాకే కన్ఫామ్ చేయాల్సి ఉంటుంది.