విజయ్ దేవరకొండకు ఫ్యాన్స్ లేరా?

Update: 2017-11-13 15:47 GMT
ఓ భారీ సక్సెస్ వచ్చిందంటే.. ఓ హీరోకు అభిమానులు ఏర్పడడం.. వారిలో కొందరు ఫ్యాన్స్ అసోసియేషన్స్ ను ఏర్పాటు చేసేసి.. సినిమా సినిమాకి హంగామా చేయడం మామూలే. ఇక అర్జున్ రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అయితే ఇలాంటి డిమాండ్స్ బోలెడన్ని పెరుగుతాయి. నిజానికి పెళ్లి చూపులు మూవీ సమయానికే ఈ హీరోకు బోలెడంత క్రేజ్ వచ్చేసింది.

అయితే.. రీసెంట్ గా అర్జున్ రెడ్డితో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత కూడా.. ఒక్కటంటే ఒక్కటి కూడా విజయ్ దేవరకొండకు ఫ్యాన్స్ అసోసియేషన్ ఏర్పడలేదు. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి అనిపించక మానదు. కానీ దీని వెనుక ఆ హీరోనే ఉన్నాడంటే ఆశ్చర్యం వేస్తుంది. అర్జున్ రెడ్డి హిట్ తర్వాత.. చాలా మందే విజయ్ దేవరకొండను సంప్రదించారు. తాము ఇలా అభిమాన సంఘం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు చెప్పాడు. కానీ ఈ యంగ్ సెన్సేషనల్ హీరో మాత్రం.. వారి కోరికను సున్నితంగా తిరస్కరించడమే కాదు.. తనకు ఇలాంటి ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఏవీ వద్దని.. తనను తనలా ఉండనీయమని చెప్పేశాడట.

ఎన్ని ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉంటే అంత ప్రెస్టేజ్ అనుకునే రోజుల్లో.. అసలు తనకు అలాంటి సంఘాలేవీ వద్దంటూ.. తన స్టైల్ ను మరోసారి చాటి చెప్పాడు విజయ్ దేవరకొండ. సినిమాలు ఎంచుకోవడంలో మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ లో కూడా తన డిఫరెంట్ బిహేవియర్ తో విపరీతమైన ఆసక్తి కలిగించేస్తున్నాడు ఈ యంగ్ హీరో. మరి ఇలా ఫ్యాన్స్ అసోసియేషన్స్ వద్దని చెప్పడం.. లాంగ్ టెర్మ్ లో ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
Tags:    

Similar News