బయోపిక్ ల జోరు అంతకంతకు పెరుగుతోంది. ఒకదాని వెంట ఒకటిగా బయోపిక్ లు తెరకెక్కించేందుకు దర్శకనిర్మాతలు కథలు రాసుకుంటున్నారు. ఆ క్రమంలోనే ఇబ్బడిముబ్బడిగా బయోపిక్ ప్రకటనలు వెలువడుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్టీఆర్ - వైయస్సార్ - సైంటిస్ట్ రాకేశ్ శర్మ - కపిల్ దేవ్ - సైనా నెహ్వాల్ - సానియా - షకీలా బయోపిక్ లు తెరకెక్కుతున్నాయి. సన్నీలియోన్ బయోపిక్ వెబ్ సిరీస్ గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. యోగా గురూ రామ్ దేవ్ బాబాపైనా టీవీ సిరీస్ తెరకెక్కనుంది. ఆ క్రమంలోనే మరో క్రేజీ బయోపిక్ గురించిన ఆసక్తికర సమాచారం అందింది. తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవిత కథను వెండితెరకెక్కించేందుకు గత కొంతకాలంగా సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
దీనికి సంబంధించి అధికారిక వార్త అందింది. మదరాసిపట్టణం - నాన్న చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఓ మార్క్ వేసుకున్న ఏ.ఎల్.విజయ్ జయలలిత బయోపిక్ కి దర్శకత్వం వహించనున్నారు. తమిళం - తెలుగు - హిందీలో తెరకెక్కనున్న ఈ సినిమాను విబ్రి మీడియా పతాకంపై విష్ణు ఇందూరి- బృందా ప్రసాద్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఇదే సంగతిని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేయడం విశేషం. మరోవైపు ఏ.ఎల్ విజయ్ తెరకెక్కించిన డ్యాన్స్ బేస్డ్ మూవీ `లక్ష్మీ` రిలీజ్ కి వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ అనంతరం అతడు క్రేజీ బయోపిక్ పై దృష్టి సారించనున్నారు.
ఈ క్రేజీ బయోపిక్ జయలలిత జయంతి రోజున - అంటే 2019 ఫిబ్రవరి 24న ప్రారంభం కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ సాగుతోంది. నటీనటులు - టెక్నీషియన్లు ఎవరు? అన్నది ఫైనల్ చేయాల్సి ఉందింకా. జయలలిత ఇటు తెలుగు - తమిళ్ - అటు హిందీ పరిశ్రమకు సుపరిచితమైన నటి - పైగా తమిళనాడు ముఖ్యమంత్రిగా - సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మహా నాయకురాలిగా ప్రజలకు సుపరిచితురాలు కాబట్టి అన్ని భాషల్లోనూ ఈ బయోపిక్ కి అంతే క్రేజు నెలకొంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.