ఎన్టీఆర్‌ దంగల్‌ అవతారం..!

Update: 2018-11-12 13:09 GMT
‘అరవింద సమేత’ చిత్రంతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్‌ ప్రస్తుతం రాజమౌళి మల్టీస్టారర్‌ మూవీ ఆర్‌ ఆర్‌ ఆర్‌ కోసం సిద్దం అవుతున్నాడు. రామ్‌ చరణ్‌ తో కలిసి ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ నటించబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ కాస్త బరువుగా, ఎప్పటికంటే కాస్త ఎక్కువ గడ్డంతో కనిపించబోతున్నట్లుగా సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా ఎన్టీఆర్‌ లావు అయినట్లుగా కనిపించాడు.

సినిమా కథ ఏంటీ, ఎన్టీఆర్‌, చరణ్‌ ల పాత్రలు ఏంటీ అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు కాని ఎన్టీఆర్‌ మాత్రం ఈ చిత్రంలో లావు కాబోతున్నాడు  అంటూ ప్రచారం జరుగుతుంది. దంగల్‌ చిత్రంలో అమీర్‌ ఖాన్‌ తరహాలో ఈ చిత్రంలో కూడా ఎన్టీఆర్‌ బాడీ బిల్డింగ్‌ తో కనిపిస్తాడని సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. చరణ్‌ మాత్రం ప్రస్తుతం ఉన్న బాడీతోనే కనిపించే అవకాశం ఉంది.

ఈనెల 19 నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ లో ఎన్టీఆర్‌ మరియు చరణ్‌ లు పాల్గొనబోతున్నారు. షూటింగ్‌ పూజా కార్యక్రమాలు పూర్తి చేసిన చిత్ర యూనిట్‌ సభ్యులు ఇంకా కూడా హీరోయిన్స్‌ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. మొదటి షెడ్యూల్‌ పూర్తి చేసిన తర్వాత జక్కన్న హీరోయిన్స్‌ ను ప్రకటిస్తాడేమో చూడాలి.
Tags:    

Similar News