బిగ్ బాస్ ఎన్నో సంవత్సరాల నుండి పలు భాషల్లో - వివిధ దేశాల్లో ప్రసారం అవుతుంది. కాని నూతన్ నాయుడు విషయంలో జరిగిన విధంగా గతంలో ఏ భాషలో - ఏ సీజన్ లో జరగలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయాన్ని తెలుగు బిగ్ బాస్ హోస్ట్ నాని కూడా అన్నాడు. సామాన్యుడి కోటాలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 2లో ఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడు తన వ్యక్తిత్వంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే కొన్ని కారణాల వల్ల రెండు వారాల్లోనే ఎలిమినేట్ అయ్యాడు. ఆ తర్వాత అనుకోని అవకాశంగా ప్రేక్షకుల మద్దతుతో రీ ఎంట్రీ ఇచ్చాడు. కౌశల్ ఆర్మీని ప్రసన్నం చేసుకోవడంలో సక్సెస్ అయిన నూతన్ నాయుడుకు భారీగా ఓట్లు పడటంతో ఇంట్లోకి వెళ్లాడు.
ప్రేక్షకుల మద్దతుతో రీ ఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడు మళ్లీ తనదైన గేమ్ ను ఆడుతూ వచ్చాడు. కౌశల్ ఆర్మీ మద్దతుతో వచ్చిన కారణంగా తన పూర్తి సపోర్ట్‌ను కౌశల్ కు ఇస్తూ వచ్చాడు. అందులో భాగంగానే కెప్టెన్సీ టాస్క్ లో కౌశల్ కు - రోల్ రైడాకు పోటీ జరుగగా నూతన్ నాయుడు కౌశల్ కు మద్దతుగా నిలిచాడు. ఆ సమయంలోనే రోల్ రైడాకు బంతులు విసిరేస్తూ గాయపడ్డాడు. తీవ్ర స్థాయిలో నూతన్ నాయుడు గాయం అవ్వడంతో హాస్పిటల్ లో జాయిన్ చేయాల్సి వచ్చింది. బిగ్‌బాస్ నిర్వాహకులు నూతన్ నాయుడును హాస్పిటల్ లో జాయిన్ చేశారు. నూతన్ నాయుడు దాదాపు వారం రోజుల పాటు రాకపోవడంతో అంతా కూడా ఆయన వెళ్లి పోయి ఉంటాడు అని అనుకున్నారు. కాని షాకింగ్‌గా నూతన్ నాయుడు రీ రీ ఎంట్రీ ఇచ్చాడు.
నూతన్ నాయుడు ఎంట్రీ - రీ ఎంట్రీ - రీ రీ ఎంట్రీ విషయంపై నాని మాట్లాడుతూ మీరు బిగ్ బాస్ ఇంటికి అత్తారింటికి వచ్చి వెళ్తున్నట్లుగా వెళ్తున్నారు. ఇలా వెళ్లి అలా వచ్చేస్తా అంటూ ఇంటి సభ్యులకు చెప్పి వెళ్తున్నారు అంటూ కామెడీ చేశాడు. బిగ్ బాస్ చరిత్రలో మీకు మాత్రమే ఇలా జరిగింది అంటూ నాని పేర్కొన్నాడు. బయట విషయాలు అన్ని మీకు తెలిసి పోయాయి. బయట ఏం జరుగుతుందో - ఇంట్లో ఎలా ఉండాలో - ఎలా ఉండకూడదో మీకు తెలిసి పోయింది. ఇప్పుడు మీరు ఎలా ఆడతారు అనేది అందరు చూడాలని భావిస్తున్నారు అంటూ నాని చెప్పుకొచ్చాడు. నూతన్ నాయుడు ఈసారి బయటకు వెళ్లడం అంటే పూర్తిగా ఎలిమినేట్ అయితేనే వెళ్తాడో లేదంటే మళ్లీ అలా వెళ్లి ఇలా వస్తాడో అంటూ మళ్లీ చర్చ మొదలైంది. నూతన్ నాయుడు పలు సార్లు బయటకు వెళ్లిన కారణంగా ఇంటి సభ్యులు ఆయన్ను ఎలిమినేషన్ కు నామినేట్ చేసే అవకాశం ఉంది. మిగిలింది మూడు వారాలు కనుక నూతన్ నాయుడు ఫైనల్ పార్టిసిపెంట్స్ జాబితాలో ఉంటాడో లేదో చూడాలి.