ఏఎంబీ దోసెల బండి

Update: 2018-12-24 22:30 GMT
రోడ్‌ సైడ్ టిఫిన్‌ బిజినెస్.. తోపుడు బ‌ళ్ల వ్యాపారం క్లిక్క‌యితే మామూలుగా ఉండ‌దని చెబుతుంటారు. ఒక సాధాసీదా ఇడ్లీ- వ‌డ‌ - దోసెల వ్యాపారం చేసేవాడు సైతం రోజుకు రూ.5000 క‌ళ్లజూస్తాడు. నెల‌కు ల‌క్ష‌ల్లో ఆదాయం ఉంటుంది. అయితే పాయింట్‌ క్లిక్క‌వ్వ‌డం అన్న‌ది ఎంతో ఇంపార్టెంట్. స‌రిగ్గా ఇదే పాయింట్ టాలీవుడ్‌ లో ప‌లువురు దిగ్గ‌జాల్ని హోట‌ల్ బిజినెస్ వైపు పురికొల్పుతోంది. రెసిపీ క‌నెక్ట‌యితే - ఫుడ్ బిజినెస్‌ లో ఉండే స్పీడ్ వేరేగా ఉంటుంది. హోట‌ల్ వ్యాపారం వేగంగా పుంజుకోవ‌డానికి కార‌ణ‌మిదే.

ఇప్ప‌టికే రియ‌ల్ ఎస్టేట్ - మ‌ల్టీప్లెక్స్ - సినిమా రంగాల్లో పెట్టుబ‌డులు పెడుతున్న ఏషియ‌న్ సినిమాస్ సునీల్ నారంగ్ ప్ర‌స్తుతం దోసెల వ్యాపారం పైనా దృష్టి సారించార‌ని తెలుస్తోంది. అతడితో పాటు సీడెడ్ పంపిణీదారుడు ఎన్‌ వీ ప్ర‌సాద్ భాగ‌స్వామిగా ఉండి ఈ వ్యాపారం సాగిస్తున్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే నారంగ్ కే చెందిన‌ ఏఎంబీ మాల్ ఉన్న కొత్త గూడ ప‌రిస‌రాల్లో ఓ దోసె సెంట‌ర్ ని ప్రారంభించార‌ట‌. అలాగే అమీర్ పేట్ స‌త్యం థియేట‌ర్ ఏరియాలోనూ ఇలాంటి దోసె సెంట‌ర్ ప్రారంభించ‌నున్నార‌ట‌. ఇలా న‌గ‌ర‌వ్యాప్తంగా దోసెల వ్యాపారాన్ని చైన్ బిజినెస్‌ లా విస్త‌రిస్తున్నార‌ని తెలుస్తోంది. అయితే దోసె బిజినెస్ అంటే మ‌రీ తోపుడు బండిలా కాకుండా కాస్త బ్రాండెడ్ గా ఉంటుంద‌న్న‌మాట‌.

నిరంత‌రం కోట్ల‌లో బిజినెస్ చేస్తూ బిజీబీజీగా ఉండే ఈ బ‌డా బాబులంతా ఇలా రోడ్ సైడ్ దోసె బిజినెస్ లోకి ప్ర‌వేశిస్తే ఇత‌రులు పోటీ త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే. అయినా బిజినెస్ చేసేవాళ్ల ల‌క్ష‌ణం ఆదాయం ఎక్క‌డ ఉంటే అక్క‌డికి వెళ్లి ఆ ప‌ని చేసేయ‌డ‌మే. అది దోసెల వ్యాపార‌మా?  లేక ఇంకేదైనానా?  గిట్టు బాటు కావ‌డం అనేదే ఇంపార్టెంట్. ముఖ్యంగా ఫ్రాంఛైజీ త‌ర‌హా బిజినెస్ చేసి రాణించ‌డం వీళ్ల‌కో హాబీ. ఏషియ‌న్ నారంగ్- ఎన్వీ ప్ర‌సాద్ బృందం చేస్తోంది అదేన‌న్న‌మాట‌.
Tags:    

Similar News