సమ్మర్ హీటెక్కుతోంది. రోజు రోజుకీ ఎండ తీవ్రత పెరిగిపోవడంతో చాలా వరకు స్టార్స్ బ్రేక్ కోసం రెడీ అయిపోతున్నారు. గత కొంత కాలంగా వరుస ప్రాజెక్ట్ లతో క్షణం తీరిక లేకుండా గడిపేసిన స్టార్స్ ఇప్పడు హీటు పెరగిపోతున్న నేపథ్యంలో సమ్మర్ బ్రేక్ ప్లీజ్ అంటున్నారు. ప్రతీ ఏడాది సమ్మర్ వెకేషన్ లంటూ విదేశాల్లో అహ్లదంగా విహరించే స్టార్స్ ఇప్పడు ఆ ప్రయత్నాల్లో వున్నారు. తమకు నచ్చిన ప్లేస్ కి ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లడానికి రెడీ అయిపోతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి మునుపెన్నడూ లేనంతగా వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారాయన. మొత్తం నాలుగు ప్రాజెక్ట్ లలో నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న చిరు తనకు బ్రేక్ కావాలంటున్నారు. త్వరలో ఫ్యామిలీతో కలిసి ఆమెరికాకు పయనం కాబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్న చిరు త్వరలోనే ఫ్యామిలీతో కలిసి అమెరికాకు విశ్రాంతి కోసం పయనం కాబోతున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన 'ఆచార్య' నిరుత్సాహ పరచడంతో ఆ హ్యాంగోవర్ ని పోగొట్టుకుని మళ్లీ ఫ్రీ మైండ్ తో హైదరాబాద్ లో అడుగుపెట్టాలనుకుంటున్నారట.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే ఫ్యామిలీతో కలిసి సమ్మర్ ట్రిప్ లో వున్నారు. ఇటీవలే ఫ్యామిలీతో కలిసి స్పెయిన్ వెళ్లిన మహేష్ అక్కడి వీధుల్ఓ పిల్లలు గౌతమ్, సితార తో కలిసి విహరిస్తూ హల్ చల్ చేశారు.
ఇప్పటికీ అక్కడే వున్న మహేష్ త్వరలోనే హైదరాబాద్ తిరిగి రాబోతున్నారు. 'సర్కారు వారి పాట' రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనడానికి రాబోతున్నారు. ఈ సోమవారం ఈ మూవీ ట్రైలర్ ని మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ చూసిన వాళ్లంతా 'పోకిరి' మహేష్ బ్యాక్ అగైన్ అంటూ కామెంట్ లు చేస్తున్నారు.
'సర్కారు వారి పాట' రిలీజ్ తరువాత మహేష్ మరోసారి ఫ్యామిలీతో కలిసి సమ్మర్ వెకేషన్ కి మరో కంట్రీకి వెళ్ల నున్నారు. తిరిగి వచ్చాకే త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ని ప్రారంభిస్తారట. ఇటీవల 'ట్రిపుల్ ఆర్' ప్రమోషన్స్ తో చాలా టైడ్ అయిన స్టార్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రస్తుతం రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ఎన్టీఆర్ జూన్ వరకు ఫ్యామిలీతో గడపబోతున్నారు. చరణ్ కూడా శంకర్ సినిమాకు సంబంధించిన మరో షెడ్యూల్ ని పూర్తి చేసి ఆ తరువాత బ్రేక్ తీసుకోబోతున్నారు.
ఇటీవల స్విట్జర్లాండ్ కి ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లిన చరణ్ ప్రస్తుతం మాత్రం ఇండియాలోనే విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారట. ఇక నేచురల్ స్టార్ నాని, శర్వానంద్, నాగచైతన్య కూడా మే అంతా బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నారట. ఇక చాలా మంది హీరోలు, హీరోయిన్ లు మే నెలలో షూటింగ్ చేయడానికి ఇష్టపడటం లేదని, బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నారని తెలుస్తోంది. అంటే చాలా వరకు మేలో టాలీవుడ్ బ్రేక్ మోడ్ లోకి వెళ్లనుందన్నమాట.