చెర్రీ రికార్డును బ‌న్ని కొట్టేస్తాడా?

Update: 2020-01-25 13:41 GMT
సంక్రాంతి పందెంలో అల వైకుంఠ‌పుర‌ములో హ‌వా గురించి తెలిసిందే. క్లీన్ బాక్సాఫీస్ హిట్ గా ట్రేడ్ నిపుణులు డిక్లేర్ చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద 100 కోట్ల షేర్ పైగా వ‌సూలు చేయ‌డం సంచ‌ల‌నం అనే చెప్పాలి. బ‌న్ని కెరీర్ బెస్ట్ గా నిలిచింద‌ని విశ్లేషిస్తున్నారు. ఇక అమెరికా బాక్సాఫీస్ వ‌ద్ద‌ టాప్ 5 చిత్రంగా రికార్డుల‌కెక్క‌డం హాట్ టాపిక్ గా మారింది.

ఇన్నాళ్లు అమెరికాలో టాప్ 5లో బాహుబలి 2 - 11.81 మిలియన్ (తెలుగు వెర్షన్ మాత్రమే) డాల‌ర్ల‌తో నంబ‌ర్ 1 స్థానంలో నిల‌వ‌గా.. బాహుబలి 1 - 6.86 మిలియన్ అమెరికా డాల‌ర్ల‌తో రెండో స్థానంలో నిలిచింది. ఆ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ న‌టించిన రంగస్థలం - 3.51 మిలియన్ డాల‌ర్ల‌తో టాప్ 3 లో స్థిరంగా నిలిచింది. ఆ త‌ర్వాత మ‌హేష్ న‌టించిన  భరత్ అనే నేను - 3.42 మిలియన్ డాల‌ర్ల‌తో టాప్ 4లో ఉంది. ఇప్పుడు 3.23 మిలియన్ (ఇప్పటికి లెక్క‌లు) డాల‌ర్ వ‌సూళ్ల‌తో అల వైకుంఠపురములో టాప్ 5 స్థానంలో నిలిచింది. ఇప్ప‌టివ‌ర‌కూ ఐదో స్థానంలో సాహో ఉండేది. ఇప్పుడు ఆ సినిమా ఆరో స్థానానికి ప‌రిమిత‌మైంది.

బ‌న్నీకి అమెరికాలో తొలి 3 మిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్ సినిమా ఇది. అంటే 20 కోట్ల క్ల‌బ్ సినిమా అన్న మాట‌. రేసు గుర్ర‌మ్ 1.4 మిలియన్ డాలర్లు.. స‌న్నాఫ్‌ సత్యమూర్తి 1.3 మిలియన్ డాలర్లు.. దువ్వాడ జగన్నాధం 1.2 మిలియన్ డాలర్లు వ‌సూలు చేయ‌గా ఇప్పుడు త్రివిక్ర‌మ్ మ్యాజిక్ తో అల వైకుంఠ‌పురములో 3 మిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్ లో చేరింది. బ‌న్ని కెరీర్ బెస్ట్ చిత్రంగా నిలిచింది. అల వ‌సూళ్లు ఇప్ప‌టికి నెమ్మ‌దించాయి కాబ‌ట్టి రంగ‌స్థ‌లం రికార్డును బ్రేక్ చేస్తుందా? అంటే చెప్ప‌లేని ప‌రిస్థితి. అలా అయినా అమెరికాలో టాప్ 5లో మాత్రం స్థానం సంపాదించిన‌ట్టే. ఇక టాప్ 1.. టాప్ 2లో బాహుబ‌లి 1.. బాహుబ‌లి 2 చిత్రాలు స్థిరంగా నిలిచాయి. వీటి రికార్డును బ్రేక్ చేయాలంటే మ‌ళ్లీ ఆర్.ఆర్.ఆర్ కైనా సాధ్య‌మా కాదా? అన్న‌ది ఇప్పుడే చెప్ప‌లేం.
Tags:    

Similar News