పరేష్ రావల్.. కామెడీ నుంచి క్రూక్డ్ విలన్ వరకూ ఏ కేరక్టర్ ని అయినా అవలీలగా తన స్టైల్ లో పోషించ గల విభిన్న నటుడు. డియర్ ఫాదర్ అనే ఓ నాటక ప్రదర్శన కోసం త్వరలో హైద్రాబాద్ వస్తున్నాడీయన. తనకు ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరూ లేకపోయినా.. ఇక్కడి వాతావరణం చాలా నచ్చుతుందని చెప్పాడు. అలాగే ఇక్కడి ఇండస్ట్రీ జనాలను కూడా పొగిడేశాడు పరేష్ రావల్.
'హైద్రాబాద్ ఆడియన్స్ చాలా షార్ప్. కళకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడి వారితో నా అనుబంధం ఎక్కువే' అన్న పరేష్.. సినీరంగంపైనా కొన్ని కామెంట్స్ చేశాడు. 'ఇక్కడ పరిశ్రమ బాగా ఆర్గనైజ్ చేస్తారు. డిసిప్లిన్ కూడా ఎక్కువే. లీడ్ యాక్టర్లతో సహా దాదాపు అందరూ టైంకి వచ్చేస్తారు. అలాగే వర్క్ కూడా అనుకున్న సమయానికి పూర్తయిపోతూ ఉంటుంది. అంతే కాదు.. చెప్పిన టైమ్ కి పేమెంట్స్ కూడా ఇచ్చేస్తారు' అంటూ నవ్వేశాడు పరేష్.
బాలీవుడ్ తోపాటు పలు భాషల్లో నటించిన ఈ వెర్సటైల్ యాక్టర్.. తెలుగులో వర్మ సినిమాల్లోను, మెగాస్టార్ తోను ఎక్కువగా కలిసి నటించాడు. చివరగా పవన్ కళ్యాణ్ మూవీ తీన్ మార్ లో కనిపించాడంతే. అయితే నచ్చిన రోల్ వస్తే మాత్రం.. తెలుగు సినిమాల్లో నటించడానికి ఎప్పుడూ సిద్ధమే అని చెప్పిన పరేష్ రావల్.. త్వరలో ప్రధాని నరేంద్రమోడీపై బయోపిక్ చేయనుండడం విశేషం. తనే ప్రొడ్యూసర్ గా మారి ఈ సినిమా తీయనున్నాడు పరేష్ రావల్.