ఈమద్య కాలంలో సినిమా బడ్జెట్ ను చూసి ప్రేక్షకులు హిట్ చేయడం లేదు. భారీ బడ్జెట్ పెట్టినంత మాత్రాన సినిమాను ప్రేక్షకులు చూసేందుకు ఆసక్తి చూపడం లేదు. సినిమాలో మ్యాటర్ ఉన్నట్లయితేనే ఆ సినిమాకు టికెట్లు తెగుతున్నాయి. భారీ బడ్జెట్ సినిమాతో పాటు చిన్న సినిమా వచ్చినా ఆ చిన్న సినిమాలో కంటెంట్ ఉంటే ఖచ్చితంగా మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి. తాజాగా మరోసారి ఆ విషయం నిరూపితం అయ్యింది.
భారీ బడ్జెట్ సినిమా పానిపట్ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాకు పోటీ అన్నట్లుగా విడుదలైన చిన్న సినిమా పతి పత్ని ఔర్ వోహ్ మంచి వసూళ్లు రాబడుతోంది. మొదటి రోజే ఏకంగా 9 కోట్ల వరకు నెట్ కలెక్షన్స్ ను ఈ చిత్రం రాబట్టినట్లుగా బాలీవుడ్ ట్రేడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఒక చిన్న సినిమా ఈ స్థాయిలో ఓపెనింగ్స్ ను రాబట్టడం బాలీవుడ్ ట్రేడ్ వర్గాల వారిని కూడా ఆశ్చర్య పర్చుతోంది.
బూతు కామెడీ కంటెంట్ తో రూపొందిన ఈ చిత్రంకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. భారీ సినిమా ఉన్నా కూడా ఈ సినిమాను ప్రేక్షకులు ఆధరిస్తున్నారు. సినిమాలో పెద్ద స్టార్స్ లేకున్నా.. కనీసం మంచి పాటలు లేకున్నా కూడా సినిమాకు మాత్రం మంచి వసూళ్లు వస్తున్నాయి.